సిగ్గులేదా నీకు అంటూ అనీ మాస్టర్‌ ఫైరింగ్‌.. ఉమాదేవి ఉగ్రరూపం.. కొట్టుకున్న బిగ్‌బాస్‌5 సభ్యులు

Published : Sep 15, 2021, 07:08 PM IST
సిగ్గులేదా నీకు అంటూ అనీ మాస్టర్‌ ఫైరింగ్‌.. ఉమాదేవి ఉగ్రరూపం.. కొట్టుకున్న బిగ్‌బాస్‌5 సభ్యులు

సారాంశం

 ఓ వైపు బయట ఈ రియాలిటీ షోపై అనేక విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు దీన్ని బ్యాన్‌ చేయాలని, సమాజాన్ని తప్పుదారి పట్టించేలా షో ఉందని సీపీఐ నాయకులు నారాయణ విమర్శలు గుప్పించారు. ఓ వైపు దీనిపై చర్చ జరుగుతుంది.  మరోవైపు బిగ్‌బాస్‌ షో ఐదో సీజన్‌ హౌజ్‌లో ఇంటిసభ్యులు కొట్టుకోవడం ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గింది గొడవలు ఎక్కువయ్యాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రేటింగ్‌ బాగా పడిపోయిందనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. ఈ సీజన్‌ ఫస్ట్ డే షో రేటింగ్‌ ఎంతో ఇంకా క్లారిటీ లేదు. ఓ వైపు బయట ఈ రియాలిటీ షోపై అనేక విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు దీన్ని బ్యాన్‌ చేయాలని, సమాజాన్ని తప్పుదారి పట్టించేలా షో ఉందని సీపీఐ నాయకులు నారాయణ విమర్శలు గుప్పించారు. ఓ వైపు దీనిపై చర్చ జరుగుతుంది. 

మరోవైపు బిగ్‌బాస్‌ షో ఐదో సీజన్‌ హౌజ్‌లో ఇంటిసభ్యులు కొట్టుకోవడం ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇప్పటి వరకు నాలుగు షోలు అయిపోయాయి. కానీ ఎవరూ కొట్టుకున్నట్టుగా లేదు. కానీ ఈ సారి మాత్రం కొట్టుకుంటున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ విషయాన్ని ఇంటి సభ్యులే చెప్పడం విశేషం. ఓ వైపు స్వేత వర్మ, మరోవైపు ఉమాదేవి, ఇంకో వైపు అనీ మాస్టర్‌ కొట్టుకుంటున్నట్టుగా ఆరోపణలు చేసుకుంటున్నారు. 

అంతేకాదు హద్దులు మీరి బూతులు తిట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజా ప్రోమోలో అలారం మోగగానే ఇంటి సభ్యులు నిన్నటి టాస్క్ లో భాగంగా తమ జట్టు ఫ్లాగ్‌లను దక్కించుకునే పనిలో పడ్డారు. అందుకోసం ఎదుటి టీమ్‌ సభ్యులపై విరుచుకుపడ్డారు. వాళ్ల దగ్గరనుంచి వాటిని లాక్కునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఉమా కొట్టిందనే వాయిస్‌ వినిపించింది. కొట్టుకుంటున్నారంటూ స్వేత వర్మ బిగ్‌బాస్‌ ముందుకొచ్చి చెప్పింది. తాను ఉండనని వెళ్లిపోతానని తెలిపింది. 

మరోవైపు `ఒసేయ్‌ ఉమా. చించుతావా.. సిగ్గులేదే.. తూ.. చిల్లర్‌ ` అంటూ అనీ మాస్టర్‌ రెచ్చిపోయారు. కోపంతో ఊగిపోయారు. మరోవైపు ఉమాదేవి సైతం ఉగ్రరూపం చూపించింది. కొడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిగ్గులేదే అంటూ, చిల్లర్‌ అన్న మాటకి `నువ్వు పెద్ద క్లాస్‌ మరీ ` అంటూ తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయింది. లేటెస్ట్ ప్రోమోలో ఇది హైలైట్‌గా నిలిచింది. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.ఈ కొట్టుకోవడం ఏంట్రా బాబూ అంటూ, గేమ్‌ ఆడమంటే కొట్టుకుంటారేంట్రా, ఒక్కరు కూడా కరెక్ట్ కంటెస్టెంట్లు లేరని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మరి ప్రోమోనే ఇలా ఉందంటే ఈ రోజు ఎపిసోడ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..