శ్రీముఖి ఇంట విషాదం.. యాంకర్‌ ఎమోషనల్‌ పోస్ట్

Published : Sep 15, 2021, 05:35 PM IST
శ్రీముఖి ఇంట విషాదం.. యాంకర్‌ ఎమోషనల్‌ పోస్ట్

సారాంశం

బుల్లితెర యాంకర్‌, నటి శ్రీముఖి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె అమ్మమ్మ సోమవారం కన్నుమూశారు. దీంతో శ్రీముఖి ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ ని అభిమానులతో పంచుకుంది. 

యాంకర్‌ శ్రీముఖి ఇంట విషాదం చోటు చేసుకుంది. శ్రీముఖి అమ్మమ్మ సోమవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని యాంకర్‌ శ్రీముఖి సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా తెలియజేసింది. ఈ మేరకు ఆమె ఎమోషనల్‌ నోట్‌ని పంచుకుంది. అమ్మమ్మతో ఉన్న ఫోటోని పంచుకుంటూ `అమ్మమ్మ అంటే నాకిష్టం. జీవితంలో చాలా విషయాలను నాకు చెప్పింది. ఎప్పుడూ హుషారుగా ఉండేది. అందరికి సంతోషాన్ని పంచేది. 

ఎల్లప్పుడు సంతోషాన్ని అందరికి పంచేది.ఆమె చాలా ధైర్యవంతురాలు. జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పటికీ నిన్ను గుర్తు పెట్టుకుంటాను అమ్మమ్మ` అని ఎమోషనల్‌ నోట్‌ని షేర్‌ చేసింది శ్రీముఖి. దీంతో శ్రీముఖి అమ్మమ్మకి పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియజేశారు. 

ఇక శ్రీముఖి యాంకర్‌గా రాణిస్తుంది. తెలుగు యాంకర్స్ లో టాప్‌లో ఒకరిగా రాణిస్తుంది శ్రీముఖి. బుల్లితెర రాములమ్మగా పాపులర్‌ అయ్యింది. జీ తెలుగు, స్టార్‌ మా స్పెషల్‌ ఈవెంట్లకి ఇప్పుడు బెస్ట్ ఆప్షన్‌ శ్రీముఖి కావడం విశేషం. అయితే రెగ్యూలర్‌గా ఆమె చేతిలో ఒక్క షో కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు ఇటీవల ఆమె మెయిన్‌ లీడ్‌గా `క్రేజీ అంకుల్స్` చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రిజల్ట్ ని దక్కించుకోలేకపోయింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?