
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ తెరకెక్కించిన సినిమా జైలర్. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈసినిమాను అనిరుధ్ రవిచంద్రన్ అద్భుతమైన బాణీలు అందించారు. చాలా కాలంగా ఫెయిల్యూర్స్ తో రజినీ బాధపడుతున్నాడు. అది అలుసుగా తీసుకుని.. ఇక రజినీకాంత్ పని అయిపోయింది అన్నవారు కూడా ఉన్నారు. కాని తన సత్తా ఏంటో ఈసారి నిరూపించాడు సూపర్ స్టార్. జైలర్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వరద పారించాడు. నెల్సన్ దిలీప్ అద్భుతమైన కథ, డైరెక్షన్ లో సూపర్ హిట్ అందించాడు.
ఇప్పటికే జైలర్ మూవీ రిలీజ్ అయిన 9 రోజుల్లో 400 కోట్లు దాటి.. 500 కోట్ల కలెక్షన్ మార్క్ కు దగ్గరగా ఉంది. ఒక్క తమిళనాట మాత్రమే కాదు.. టాలీవుడ్, శాండల్ వుడ్ తో పాటు, మాలీవుడ్ లో కూడా సూపర్ స్టార్ పరుగులు పెట్టిస్తున్నాడు. ఇక ఈమూవీ తమిళ నాట తరువాత కర్నాటకలో మరింత ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళం తరువాత ఈ రాష్ట్రంలోనే అత్యధిక వసూళ్లు సాధించిందట సినిమా
ఇక ఇప్పటికే 400 కోట్ల మేర భారీ గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం మన తెలుగు స్టేట్స్ లో కూడా అదిరే వసూళ్ళని ఈ చిత్రం అందుకోగా లేటెస్ట్ గా అయితే కర్ణాటకలో కూడా భారీ వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ చిత్రం 9 రోజుల్లో అయితే కర్ణాటకలో 50 కోట్ల క్లబ్ లోకి చేరింది. దీనితో తమిళ్ నుంచి రెండో చిత్రంగా జైలర్ ఈ ఫీట్ ని అందుకున్న దానిగా నిలిచింది. మరి ఈ మొత్తం 9 రోజుల్లో ఈ చిత్రం 52.2 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ అందించగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే శివ రాజ్ కుమార్ మరియు మోహన్ లాల్ లు పవర్ ఫుల్ క్యామియో రోల్స్ లో నటించారు.