షాకింగ్ :'గేమ్ చేంజర్' రిలీజ్ అప్పుడా? సంక్రాతికి లేనట్లే

Published : Aug 19, 2023, 02:55 PM IST
 షాకింగ్ :'గేమ్ చేంజర్' రిలీజ్ అప్పుడా? సంక్రాతికి లేనట్లే

సారాంశం

శంకర్ 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్‌ని అనౌన్స్ చేసిన తర్వాత ఈ సినిమాపై హైప్  పెరిగింది. అయితే తాాజాగా గేమ్ ఛేంజర్ గురించి షాక్ ఇచ్చే ఓ వార్త  వైరల్ అవుతోంది.


మెగాభిమానులు అసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం రామ్‌ చరణ్‌ (Ram Charan) ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). దశల వారిగీ  షూటింగ్ జరుపుకుంకున్న ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు అవుతుంది అనేది క్లారిటీ లేదు. దీని అప్‌డేట్స్‌ కోసం రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు ఉండవచ్చునే విషయమై సోషల్‌మీడియాలో  డిస్కషన్ మొదలైంది. దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

  రిలీజ్ పై అయితే తుది నిర్ణయం శంకర్ గారిదే అని నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేసారు. అయితే  ఇండస్ట్రీలో వినపడుతున్న దాని ప్రకారం ఈ చిత్రం థియేటర్స్ లో వచ్చేసరికి మరో ఏడాది పట్టేలా ఉందని   వినిపిస్తోంది. అంటే మళ్ళీ వచ్చే ఏడాది ఆగస్ట్ లో అయితే ఈ చిత్రం రిలీజ్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తలో  ఎంతవరకు నిజం అనేది మేకర్స్ క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త కూడా నెట్టింట వైరలవుతోంది. ‘కేజీఎఫ్‌’లో అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలు చేసిన అన్బు, అరివులు ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో ఫైటింగ్‌ సీన్స్‌పై అంచనాలు పెరిగాయి. ఇవే ఈ మూవీలో హైలైట్‌ కానున్నాయని సమాచారం. దిల్‌ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్‌ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. 

పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది రానుంది. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. రామ్‌ చరణ్‌ సరసన కియారా అడ్వాణీ నటిస్తోన్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?