Mahesh Babu:ఒక్క యాడ్ కోసం మహేష్ అన్ని కోట్లు ఛార్జ్ చేశాడా?

Published : Feb 08, 2022, 08:41 PM ISTUpdated : Feb 08, 2022, 08:59 PM IST
Mahesh Babu:ఒక్క యాడ్ కోసం మహేష్ అన్ని కోట్లు ఛార్జ్ చేశాడా?

సారాంశం

మన స్టార్ హీరోలలో అత్యధిక సంస్థలకు బ్రాండ్ అంబాసర్ గా ఉన్న ఘనత మహేష్ సొంతం. కాగా మహేష్ ప్రముఖ బేవరేజ్ ప్రోడక్ట్ మౌంటెన్ డ్యూ కి ప్రచార కర్తగా మారారు. ఇక ఈ కూల్ డ్రింక్ ప్రచార వీడియో భారీ ఎత్తున చిత్రీకరించారు. 


టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ (Mahesh babu)అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన బ్రాండ్ వాల్యూ రీత్యా ప్రముఖ నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీలు తమ ఉత్పత్తులకు ప్రచార కర్తలుగా మహేష్ ని నియమించుకుంటున్నాయి. మన స్టార్ హీరోలలో అత్యధిక సంస్థలకు బ్రాండ్ అంబాసర్ గా ఉన్న ఘనత మహేష్ సొంతం. కాగా మహేష్ ప్రముఖ బేవరేజ్ ప్రోడక్ట్ మౌంటెన్ డ్యూ కి ప్రచార కర్తగా మారారు. ఇక ఈ కూల్ డ్రింక్ ప్రచార వీడియో భారీ ఎత్తున చిత్రీకరించారు. 

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా ఉన్న బూర్జ్ ఖలీఫా దగ్గర యాడ్ షూట్ జరిగింది. సదరు యాడ్ లో మహేష్ సాహసోపేతంగా కనిపించారు. ఇక మౌంటైన్ డ్యూ ప్రచార కర్తగా ఉండడానికి మహేష్ ఏకంగా రూ. 12 కోట్లు తీసుకున్నారట. ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. 12 కోట్లు అంటే మాటలా... ఫార్మ్ లో ఉన్న ఓ టూ టైర్ హీరో రెమ్యూనరేషన్ 12 కోట్లు ఉంటుంది. మహేష్ ప్రచారంతో అమ్మకాలు పెరుగుతాయని గట్టిగా భావిస్తున్న ఆ సంస్థ అంత మొత్తంలో మహేష్ కి చెల్లించడానికి సిద్దపడింది. 

గతంలో మహేష్ కోకకోలా సంస్థకు చెందిన  థమ్స్ అప్  ప్రచార కర్తగా ఉన్నారు. ఈ శీతల పానీయానికి మహేష్ నేషనల్ వైడ్ బ్రాండ్ అంబాసడర్ గా కూడా వ్యవహరించారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి థమ్స్ అప్ యాడ్ లో నటించారు.  లేటెస్ట్ గా థమ్స్ అప్ కి బ్రాండ్ అంబాసర్ గా విజయ్ దేవరకొండ మారారు. ఆయన నటించిన థమ్స్ అప్ ప్రచార చిత్రం కూడా విడుదలైంది. 

మరోవైపు మహేష్ సర్కారు వారి పాట సంక్రాంతి రేసు నుండి తప్పుకొని సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. ఏప్రిల్ 1న విడుదల చేస్తామంటూ ప్రకటించిన టీం... మరలా మే 12కి పోస్ట్ ఫోన్ చేశారు. విడుదలకు మూడు నెలల సమయం ఉండగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 14న ప్రేమికులరోజు కానుకగా సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఇక సర్కారు వారి పాట చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 

అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మహేష్ 28వ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల చేయనున్నారు. మరోవైపు మహేష్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ కథను సిద్ధం చేయిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం