
మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల హృదయాలను తాకింది సమంత. చాలా అరుదుగా డెబ్యూ హీరోయిన్స్ ఆడియన్స్ మైండ్స్ లో రిజిస్టర్అవుతారు అలాంటి వారిలో సమంత ఒకరు. నాగ చైతన్య హీరోగా సమంత ఫస్ట్ మూవీ ఏమాయ చేశావే సూపర్ హిట్ అందుకుంది. పదేళ్ల కెరీర్ లో సమంత నెమ్మదించిన దాఖలాలు లేవు. ఆమెకు వరుసగా హిట్ దక్కాయి. సమంత హైయెస్ట్ హిట్ పర్సెంటేజ్ కలిగిన హీరోయిన్. టాప్ స్టార్స్ అందరితో నటించిన సమంత బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్స్ కొట్టింది.
ఇక ఈ పదేళ్లలో సమంత చేసిన అద్భుతమైన రోల్స్ మొత్తం కలిపి ఓ వీడియో చేశారు సమంత. సదరు వీడియోను సమంత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారింది. ఇక సమంత కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. జాను మూవీ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్న సమంత మరలా బిజీ అయ్యారు. నాగ చైతన్యతో మనస్పర్థలు, విడాకుల వలన మానసిక వేదనతో కొన్నాళ్ళు సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. విడాకుల విషయం దాచిపెట్టిన సమంత తీరక లేని షూటింగ్స్ కారణంగా బ్రేక్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
దాదాపు ఆరు నెలలు సమంత బ్రేకప్ వేదన అనుభవించారు. ఈ సమయంలో ఆమెకు స్నేహితులు అండగా నిలిచారు. డిప్రెషన్ నుండి బయటపడడానికి స్నేహితులతో వరుస విహారాలు చేశారు. మొత్తంగా కోలుకున్న సమంత కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేశారు. దర్శకుడు గుణశేఖర్ తో చేస్తున్న శాకుంతలం మూవీ షూటింగ్ పూర్తి చేసిన ఆమె... యశోద అనే మరో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం.
అలాగే సమంత ఓ వెబ్ సిరీస్ కి సైన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. గ్లామర్ విషయంలో కూడా సమంత హద్దులు దాటేస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప చిత్రంలో సమంత చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా ఊ ఊ అంటావా... లో సమంత గ్లామర్ షో బోర్డర్స్ దాటేసింది. సమంత హాట్నెస్ కి జనాలు నోటిఫై వేలేసుకున్నారు.
ఇక సమంత ఫోకస్ మొత్తం బాలీవుడ్ పై ఉన్నట్లు సమాచారం. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ద్వారా సమంత హిందీ ప్రేక్షకుల మనసులలో రిజిస్టర్ అయ్యారు. ఆమెకు ఆ సిరీస్ కొంత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక అల్లు అర్జున్ పుష్ప హిందీ వర్షన్ సూపర్ హిట్ కొట్టింది. వంద కోట్లకు పైగా కలెక్షన్స్ లో దుమ్మురేపింది. పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేయడం సమంతకు అనుకోకుండా కలిసొచ్చింది. బాలీవుడ్ లో సైతం ఊ అంటావా సాంగ్ పాప్యులర్ అయిన నేపథ్యంలో సమంత పేరు మరోమారు హైలెట్ అయ్యింది.