Prabhas Mirchi Movie: తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న ప్రభాస్ మిర్చి... ఈ సినిమా తరువాతే...?

Published : Feb 08, 2022, 06:38 PM IST
Prabhas Mirchi Movie: తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న ప్రభాస్ మిర్చి...   ఈ సినిమా తరువాతే...?

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడు యూనివర్సల్ స్టార్. ఆయన కెరీర్ పరంగా చూస్తే.. మిర్చి సినిమాకు ముందు.. మిర్చి సినిమా తరువాత అని కాల్యూక్లేట్ చేయవచ్చు. ప్రభాస్ కెరీర్ ను కంప్లీట్ గా మార్చేసిన మిర్చి(Mirchi) సినిమా రిలీజ్ అయ్యి నేటికి 9 ఏళ్లు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడు యూనివర్సల్ స్టార్. ఆయన కెరీర్ పరంగా చూస్తే.. మిర్చి సినిమాకు ముందు.. మిర్చి సినిమా తరువాత అని కాల్యూక్లేట్ చేయవచ్చు. ప్రభాస్ కెరీర్ ను కంప్లీట్ గా మార్చేసిన మిర్చి(Mirchi) సినిమా రిలీజ్ అయ్యి నేటికి 9 ఏళ్లు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కెరీర్ లో మర్చిపోలేని సినిమా మిర్చి (Mirchi). ఈ సినిమా తరువాత ఆయన బాహుబలి కోసం మూడేళ్లు గ్యాప్ తీసుకున్నారు. ఆతరువాత నుంచే ప్రభాస్(Prabhas) లైఫ్ మారిపోయింది. యంగ్ రెబల్ స్టార్ కాస్తా.. యూనివర్సల్ స్టార్ అయిపోయాడు. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఫెయిల్యూర్స్ అంటూ లేకుండా కెరీర్ లో దూసుకుపోతున్న దర్శకులలో.. రాజమౌళి తరువాత వినిపించే పేరు కొరటాల శివ (Koratala Siva )దే. భద్ర, బృందావనం లాంటి సినిమాలతో రచయితగా గుర్తింపు తెచ్చుకున్న కొరటాల 2013లో మిర్చి (Mirchi) సినిమాతో దర్శకుడిగా మారాడు.

ఆతరువాత వరుస సినిమాలతో స్టార్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్నారు కొరటాల శివ (Koratala Siva). ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన మిర్చి(Mirchi) సినిమా అప్పట్లో ఒక సంచలనం అయ్యింది. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్న కొరటాల ఆతరువాత నుంచి చేస్తున్న సినిమాలన్నీ స్టార్ హీరోలతోనే.  ఇక ఫస్ట్ సినిమా.. సెంటిమెంట్ టాలీవుడ్ అంతా అన్ సీజన్ అని భయపడే ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీసు దగ్గర రికార్డులు తిరగరాసింది.

అప్పటి వరకూ ప్రభాస్ (Prabhas) ను ఎవరూ చూపించని విధంగా చూపించాడు డైరెక్టర్ కొరటాల శివ. అప్పటి వరకు ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మిర్చే కావడం విశేషం. అంతకు ముందు వరకూ డార్లింగ్,మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేసుకుంటూ వచ్చి.. రెబల్ సినిమాతో ఫెయిల్యూర్ ను ఫేస్ చేసిన ప్రభాస్ కు వెంటనే మంచి హిట్ సినిమా అందించాడు శివ. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈసినిమాలో అనుష్క (Anushka), రిచా గంగోపాధ్యాయ  హీరోయిన్లుగా నటించారు.

 

ఇక ప్రభాస్ (Prabhas) మిర్చి(Mirchi) సినిమా రిలీజ్ అయ్యి నేటికి 9 ఏళ్ళు. 2013 ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమా రచ్చ రచ్చ చేసింది. మంచి కలెక్షన్స్ తో దూసుకుపోయింది.  ప్రభాస్ ను సాప్ట్ క్యారెక్టర్ లో చూసి అమ్మాయిలు ఇప్రెస్ అయ్య పడిపోయారు.. ఇక మరో శేడ్ లో ప్రభాస్ (Prabhas) యాక్షన్ చూసిన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు.

తెలుగులో మిర్చి(Mirchi) సినిమా దాదాపు 35 కోట్లకు పైగా వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది మిర్చి సినిమా. ప్రిరిలీజ్ బిజినెస్ దాదాపు 30 కోట్ల వరకూ అవ్వగా.. సినిమాకు దాదాపు 17 కోట్ల వరకూ  లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా