రచ్చ షురూ చేసిన బండ్ల గణేష్‌.. హీరోగా సినిమా

Published : Sep 04, 2021, 07:43 PM IST
రచ్చ షురూ చేసిన బండ్ల గణేష్‌.. హీరోగా సినిమా

సారాంశం

నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. బండ్ల గణేష్‌ హీరోగా రచ్చ షురూ చేశారు.

సంచలన నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ రచ్చ షురూ చేశాడు. తన కొత్త సినిమా షూటింగ్‌ని ప్రారంభించాడు. బండ్ల గణేష్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. వెంకట్‌ చంద్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న నేపథ్యంలో యూనిట్‌ స్పందించింది.

దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, `తమిళ హిట్ చిత్రం `ఒత్తు సెరుప్పు సైజ్ 7`కి‌ రీమేక్ ఇది. తమిళంలో ఆర్. పార్థిబన్‌ పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందరికీ సర్‌ప్రైజ్. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నాన్‌స్టాప్‌గా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాం` అని చెప్పారు. 

 ఈ చిత్రానికి కళా దర్శకత్వం: గాంధీ, ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: లైనస్ మధిరి, దర్శకత్వం: వెంకట్ చంద్ర, నిర్మాణం: స్వాతి చంద్ర.  `ఒత్తు సెరుప్పు సైజ్ 7`ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌ చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి
ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు