"లక్ష్మీస్ వీరగ్రంథం" పై స్పందించిన వాణివిశ్వనాథ్

Published : Nov 07, 2017, 04:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
"లక్ష్మీస్ వీరగ్రంథం" పై స్పందించిన వాణివిశ్వనాథ్

సారాంశం

ఎన్టీఆర్ జీవితంలోకొచ్చిన లక్ష్మిపార్వతి జీవితం ఆధారంగా కేతిరెడ్డి జగదీశ్ సినిమా లక్ష్మీస్ వీరగ్రంథం టైటిల్ తో సినిమాను తలపెట్టిన కెతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి "లక్ష్మీస్ వీరగ్రంథం" పై స్పందించిన వాణివిశ్వనాథ్

గత కొంత కాలంగా వాణి విశ్వనాథ్ పొలిటికల్ ఎంట్రీపై పలు ఊహాగానాలు జోరందుకున్న సంగతి తెలిసిందే. పలు సార్లు మీడియా ప్రశ్నించినప్పుడు కూడా రాజకీయాల్లోకి వస్తే చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీతోనే వస్తానని వాణి విశ్వనాథ్ స్పందించింది కూడా. అయితే వాణివిశ్వనాథ్ ను వ్యూహాత్మకంగా రంగంలోకి దించాలని.. రోజాపై పోటీ చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రోజాకు కళ్లెం వేయటానికి వాణి విశ్వనాథ్ ను రంగంలోకి దించాలనే నిర్ణయం జరిగిపోయినట్లు తెలుస్తతోంది.

 

ఇక మరోవైపు ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి పాత్రపై వర్మకు వ్యతిరేకంగా కేతినేని జగదీశ్వర్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో తెరకి ఎక్కబోతున్న లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాకిలో హీరోయిన్ గా వాణీ విశ్వనాథ్ నటిస్తుందని వార్తలొస్తున్న నేపథ్యంలో దీనిపైనా వాణి విశ్వనాథ్ మాట్లాడారు. విజయవాడ లో కనకదుర్గ గుడిలో అమ్మవారిని దర్శించుకున్న ఆమె పాత్రికేయుల తో మాట్లాడారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు మూడేళ్ళ పరిపాలన అద్భుతంగా ఉందన్నారు వాణి. చంద్రబాబు నాయకత్వం అంటే తనకి చాలా చాల ఇష్టం అన్నారు. అతి త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చి టీడీపీలో జేరే ఉద్దేశ్యం ఉందన్నారామె. ఇక సినిమా గురిచి మాట్లాడుతూ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’లో నటిస్తారా? అంటూ నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నేను ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. మా మేనేజర్ గారి ఫోన్ నెంబర్ ఇచ్చి, ఆయనతో మాట్లాడమని చెప్పా.

 

  " నా మైండ్ మొత్తం టీడీపీ లో జేరడం మీదనే ఉంది ఈ సినిమా గురించి ఆలోచించే యోచన ప్రస్తుతతం చెయ్యడం లేదు. పార్టీ కి సంబంధించి ఎలాంటి సేవలు చెయ్యగలను .. పనితీరు ఎలా ఉంటుంది , భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేదాని మీదనే నా ప్రస్తుతం ఐడియా మొత్తం " అని చెప్పుకొచ్చింది వాణి విశ్వనాథ్.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్