
సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆయన సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో ఫారెన్ టూర్ లో ఉన్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం వారం రోజులుగా జర్మనీలో పర్యటిస్తున్నాడు. భార్య నమ్రత,పిల్లలు సితార, గౌతమ్ తో కలిసి ఫ్యామిల టూర్ లో.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. జర్మనీలోని బాడెన్ బాడెన్ లో బ్రెన్నర్స్ పార్క్ హోటల్ లో మహేష్ ఫ్యామిలీ బస చేశారు. ఇక తాజాగా ఆయన తన ఇన్ స్టా గ్రామ్ పేజ్ లో చేసిన ఓ చిన్న పోస్ట్ అభిమానులను కలవరానికి గురి చేసింది.
అసలు మహేష్ బాబు పోస్ట్ చేయడమే చాలా తక్కువ. చాలా ఇంపార్టెంట్ అయితేనే ఆయన పోస్ట్ పెడతారు. లేకుంటే.. తనకు సబంధించిన విషయాలు.. తన ఫ్యామిలీకి సబంధించిన విషయాలు.. నమ్రత మాత్రమే ఎక్కువగా పోస్ట్ చేస్తుంటుంది. అటువంటిది మహేష్ పోస్ట్ చేయడం తో అభిమానులు ఇంట్రెస్ట్ గా చదువుతున్నారు. జర్మన్ డాక్టర్ హ్యారీ కోనిగ్ తో కలసి దిగిన ఫొటోని మహేష్ బాబు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దాని కింద థ్యాంక్యూ డాక్టర్ హ్యారీ కోనిగ్... ఆరోగ్యం మెరుగైన చేతుల్లో......అని పోస్ట్ పెట్టాడు.
ఈ పోస్ట్ పెట్డడంతో.. మహేష్ బాబు ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది. అసలు మహేష్ కి ఏమైంది అన్న సందేహం ఏర్పడింది. మహేష్ అనారోగ్యానికి గురయ్యారా....? హ్యారీ కోనిగ్ ట్రీట్మెంట్ చేశారా..? అందుకే మహేష్ డాక్టర్ కు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారా..? ఇలా రకరకాల ప్రశ్నలు అభిమానుల నుంచి రేజ్ అవుతున్నాయి. అసలు విషయం ఏంటీ అని తెలుసుకోవడానికి నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.
ఇక డాక్టర్ హ్యారీ కోనిగ్ జర్మనీలో ప్రముఖ నేచురోపతీ డాక్టర్. ముందస్తు వ్యాధి నివారణ ఔషధాలపై ఆయన పని చేస్తుంటారు. బ్రెన్నర్స్ మెడికల్ కేర్ సెంటర్ కు హెడ్ గా వ్యవహరిస్తున్నారు. ఇక మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో SSMB28 లో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం రన్నింగ్ లో ఉంది. ఈసినిమా తరువాత మహేష్ బాబు.. టాలీవుడ్ జక్కన్న రాజమౌళితో.. పాన్ వరల్డ్ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.