
కెజియఫ్ 2 రిలీజ్ అయ్యి ఏడాది పూర్తి అయ్యింది. ఈసినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సాధించారు హీరో యష్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. ఈక్రమంలో.. ప్రశాంత్ నీల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన ఖాతాలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయి. మూడు సినిమాలు పాన్ఇండియా సినిమాలే.. కాని అటు హీరో యష్ మాత్రం తన తదుపరి సినిమాను లాక్ చేసుకోయలేదు.
కెజియఫ్ 2 లాంటి పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ తర్వాత యష్ ఎలాంటి సినిమా చేస్తాడు. అది ఏ రేంజ్ లో ఉంటుంది అంటూ..ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాని ఆసినిమా రిలీజ్ అయ్యి ఏడాది అయినా.. ఇంకా యష్ సినిమా అనౌన్స్ చేయకపోవడంతో.. కన్నడ ఫ్యాన్స్ లో అసహనం పెరిగిపోతోంది. అంతే కాదు ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ తీవ్ర ఆసక్తి పెరిగింది. ఈలోపు సోషల్ మీడియా తనపని తాను చేసుకుంటూ వెళ్తోంది. యష్ నెక్ట్స్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనే అంటూ.. వార్తలు తెగ షికారు చేశాయి. సౌత్ నుంచి చాలా మంది స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి.
శంకర్, నార్తన్ ఇలా పలువురు పెద్ద పెద్ద డైరెక్టర్‌ల పేర్లు వినిపించినా అవి పేర్ల వరకే మిగిలిపోయాయి. వీటిపై అటు యష్ టీమ్ కూడా స్పందించకపోవడంతో రూమర్స్‌గా మారిపోయాయి. నాలుగు నెలల క్రితం ఆయన బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా ఉంటుందంటూ ప్రచారం జరిగినా.. అది కూడా రూమరం అని తేలడంతో యష్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశపడ్డారు. అసలు కొత్త సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు..? ఎవరు డైరెక్టర్ అంటూ.. తెగ సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక ఇదిలా ఉంటే తాజాగా యష్ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. యష్ నెక్స్ట్ మూవీ ఓ లేడీ డైరెక్టర్ తో అనిమరో వార్త వైరల్ అవుతుంది. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. తిరుగులేని ఇమేజ్ సాదించిన గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యష్ తదుపరి సినిమా చేయబోతున్నాడట. కేజీఎఫ్ లాంటి సినిమా తర్వాత ఒక మహిళా దర్శకురాలితో సినిమా చేయబోతున్నాడంటే.. యష్ ఏం ఆలోచిస్తున్నాడు.. ఎటువంటి కథతో రాబోతున్నాడు అని.. ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. అయితే ఈ లేడీ డైరెక్టర్ ను అంత తక్కువ అంచనా వేయడానికి లేదు.. ఆమె దర్శకురాలిగాచేసింది రెండు సినిమాలే అయినా.. అవి ఇండస్ట్రీని ఊపు ఊపేశాయి.
పదేళ్ల క్రితం లయర్స్ డైస్ అనే హిందీ సినిమా డైరెక్ట్ చేసింది గీతూ. ఈ సినిమాకు రెండు నేషనల్ అవార్డులు వచ్చాయి. ఇక మళ్లీ ఆరేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టి మిథూన్ అనే సినిమా తెరకెక్కించింది. నాలుగేళ్ల క్రితం మలయాళంలో రిలీజైన ఈ సినిమా సంచలనం గా మారింది. . అలాంటి దర్శకురాలితో యష్ సినిమా చేస్తున్నాడంటే.. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. దాదాపు ఏడాది నుంచి.. వీరిద్దరు ఈ సినిమా విషయంలో చర్చించుకుంటున్నారట. కథ, కథనాలపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అండస్ట్రాండింగ్ వస్తే.. సినిమా స్టార్ట్ చేయడమే తరువాయి అంటున్నారు. మరి అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. ఈ సినిమాను కెవిఎన్ బ్యానర్‌పై కెవిఎన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడట.