భారీ ధరకు ‘దసరా’ ఓటీటీ రైట్స్.. రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ?.. ఫుల్ డిటేయిల్స్..

By Asianet News  |  First Published Apr 16, 2023, 12:39 PM IST

నేచురల్ స్టార్ నాని బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘దసరా’ ఓటీటీ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ డీల్ కు రైట్స్ ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 


నేచురల్ స్టార్ నాని (Nani) - కీర్తి  సురేష్ జంటగా  ప్రేక్షకుల ముందుకు వచ్చిన రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ ‘దసరా’ Dasara. ఈ సినిమా  శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30న పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో విడుదలైంది. అటు ఓవర్సీస్ లోనూ విడుదలై అదరగొడుతోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ దక్కడంతో సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. కేవలం పదిరోజుల్లోనే రూ.110 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అదరగొట్టింది. ఓవర్సీస్ లోనూ 2 మిలిన్ల డాలర్స్ ను సాధించడం విశేషం. నాని కేరీర్ లోనే ఈ చిత్రం హ్యాయేస్ట్ గ్రాసింగ్ గా నిలిచింది. 

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సింగరేణి కోల్ మైన్ పరిసర ప్రాంతంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ దక్కింది. దీంతో సినిమాకు క్రేజ్ పెరిగింది. వెన్నెల, ధరణి క్యారెక్టర్లకు, యాక్షన్ సీక్వెల్స్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా సాగింది. కాగా, ప్రస్తుతం ఓటీటీ రిలీజ్ కు కూడా చిత్రం సిద్ధమైంది. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలు అందాయి. 

Latest Videos

ప్రముఖ ఓటీటీ సంస్థ Netflix ‘దసరా’ డిజిటల్ రైట్స్ ను  దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ.22 కోట్లతో డీల్ కూడా కుదుర్చుకున్నారంట. ఇక హిందీ వెర్షన్ ను మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ సొంతం చేసుకుందని సమాచారం. అయితే మే30 నుంచి చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయబోతున్నారు. స్ట్రీమింగ్ డేట్ పై త్వరలో అఫీషియల్ అప్డేట్ కూడా రానుంది. ఓటీటీ ప్రేక్షకులను కూడా ‘దసరా’ మెప్పించబోతోంది. 

నాని కేరీర్ లోనే అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా ‘దసరా’ నిలిచింది. డెబ్యూ దర్శకుడితో నాని ఈ ఘనతను సాధించడం గొప్ప విషయమని చెప్పొచ్చు. చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ నిర్మించారు. సంతోష్ నారాయణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇక నాని తన 30వ సినిమాపై ఫోకస్ పెట్టారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేేట్ ను కూడా విడుదల చేశారు. 2023 డిసెంబర్ 21న విడుదల కానుంది.

click me!