ఎన్టీఆర్ ఎప్పుడు తీస్తారా అని ఎదురుచూశా.. 365 సినిమాల్లో నా బెస్ట్ మూవీ అదే : సూపర్ స్టార్ కృష్ణ

By team teluguFirst Published Jan 2, 2022, 5:33 PM IST
Highlights

ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూపర్ స్టార్ కృష్ణని ఘనంగా సన్మానించారు.

ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూపర్ స్టార్ కృష్ణని ఘనంగా సన్మానించారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, అవంతి శ్రీనివాస్, నటుడు మోహన్ బాబు, అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో కృష్ణ మాట్లాడుతూ తన అల్లూరి సీతారామరాజు చిత్ర విశేషాలని నెమరు వేసుకున్నారు. తాను నటుడు కాకముందు నుంచి అల్లూరి గురించి బుర్రకథలు రూపంలో అనేక విషయాలు వింటూ వచ్చాను. ఒకరోజు ఎన్టీఆర్ తదుపరి చిత్రం అల్లూరి సీతారామరాజు అని చదివాను.అప్పటి నుంచి ఎన్టీఆర్ ఎప్పుడు ఈ చిత్రం తీస్తారా అని ఎదురుచూశా. 

ఎవరూ సీతారామరాజు చరిత్రని పూర్తిగా తెరకెక్కించడం లేదు అని బాధపడేవాడిని. హీరో అయ్యాక ఎన్నో చిత్రాలు చేశా. కానీ ఒక గొప్ప చిత్రం తీయాలనే కోరిక ఉండేది. నా 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు ఎంచుకుని నేనే నిర్మించా. ఆ చిత్రం ఎంతటి విజయం సాధించిందో మీ అందరికి తెలిసిందే అని కృష్ణ అన్నారు. 

నేను 365 సినిమాల్లో నటించినప్పటికీ నా ఉత్తమ చిత్రం ఎప్పటికి అల్లూరి సీతారామరాజే అని కృష్ణ తెలిపారు. ఏడాది పాటు ఆ చిత్రం ప్రేక్షకులని అలరించింది అని కృష్ణ తెలిపారు. 

 

click me!