ఈ నేపథ్యంలో తాజాగా రామ్‌చరణ్, రానా కలుసుకున్నారు. సరదాగా చిట్‌చాట్ చేశారు. అనేక విషయాలను పంచుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి దిగిన ఓ ఫోటోని పంచుకున్నారు.
రామ్‌చరణ్(Ram Charan), రానా(Rana) ఇండస్ట్రీలో మంచి స్నేహితులు. గతేడాది జరిగిన రానా మ్యారేజ్‌కి హాజరైన అతికొద్ది మంది సెలబ్రిటీల్లో రామ్‌చరణ్ ఉన్నారు. సాధ్యమైనంత వరకు వీరిద్దరు సినిమాలకు అతీతంగా కలుసుకుంటారు. ఆ విషయాలు మాత్రం బయటకు రావు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్‌చరణ్, రానా కలుసుకున్నారు. సరదాగా చిట్‌చాట్ చేశారు. అనేక విషయాలను పంచుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి దిగిన ఓ ఫోటోని పంచుకున్నారు. చరణ్‌తో దిగిన పిక్ ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు రానా.
ఈ సందర్బంగా ఆయన చెబుతూ, మూడు దశాబ్దాలుగా చిరునవ్వుతో కూడిన ముఖంతో నన్ను పట్టుకుని ఆనందంలో ముంచెత్తుతున్న రామ్‌చరణ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలిపారు రానా. కొత్త ఏడాది సందర్భంగా వీరిద్దరు కలిసి చిన్నపాటి పార్టీ చేసుకున్నట్టు ఈ ఫోటోని చూస్తుంటే అర్థమవుతుంది. రానా తన చేత్తులో రామ్‌చరణ్‌ని బంధించిన తీరు ఆకట్టుకుంటుంది. వీరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ని ప్రతిబింబిస్తుంది. అయితే ప్రస్తుతం ఇది మాత్రం `బ్రొమాన్స్` గా వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అల్లూరిని నలిపేస్తున్న భళ్లాలదేవ అంటూ సెటైరికల్ గా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు రామ్‌చరణ్,రానా బ్రొమాన్స్ అంటూ పోస్ట్ లు పెట్టడం విశేషం.
`ఆర్‌ఆర్‌ఆర్` ప్రెస్‌మీట్‌లో రాజమౌళి స్పందిస్తూ, ఇందులో హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ తక్కువగా ఉంటుంది. కానీ ఎన్టీఆర్, చరణ్ మధ్య బ్రొమాన్స్ బాగా ఉంటుందన్నారు. అంటే బ్రదర్ రిలేషన్ బాగా పండుతుందనే అర్థంలో రాజమౌళి తెలిపారు. దీంతో ఇప్పుడా పదం వైరల్ అవుతుంది. ట్రెండింగ్‌గా మారింది. చాలా మంది ఈ పదాన్ని వాడుతుండటం విశేషం. అలానే లేటెస్ట్ గా రానా పంచుకున్న ఫోటోపై నెటిజన్లు స్పందిస్తూ, రానా, రామ్‌చరణ్ బ్రొమాన్స్ అదిరిపోయిందని చెప్పడం విశేషం.
ఇటీవల ముంబయిలో `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్ ప్రమోషన్‌లో భాగంగా బిజీగా గడిపింది. ఈ సందర్భంగా రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్‌లను కలిశాడు రానా. అక్కడ నలుగురు `ఆర్‌ఆర్‌ఆర్‌ఆర్` కలిసి ఎంజాయ్ చేశారు. ఈ సందర్బంగా పంచుకున్న పిక్ వైరల్ అయ్యింది. ఇప్పుడు రానా, రామ్‌చరణ్‌ల పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్` వాయిదా పడటంతో ప్రమోషన్ కార్యక్రమాల నుంచి రిలీఫ్ తీసుకున్నారు చరణ్. దీంతో పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి `ఆర్‌ఆర్‌ఆర్`(RRR)లో నటించగా, రాజమౌళి దర్శకత్వం వహించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా విజృంభించడం, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళా, తమిళనాడులో కోవిడ్ ఆంక్షలు పెట్టడంతో సినిమాని వాయిదా వేసుకున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` వాయిదా పడటం ఇది నాల్గోసారి. కరోనా తగ్గుముఖం, పట్టి, పరిస్థితులు అనుకూలిస్తే మళ్లీ విడుదల ఉంటుందని యూనిట్ పేర్కొంది. దీంతోపాటు శంకర్ డైరెక్షన్‌లో `ఆర్‌సీ15` సినిమా చేస్తున్నారు చరణ్. `ఆచార్య` రిలీజ్‌కి సిద్ధమవుతుంది. మరోవైపు రానా ప్రస్తుతం `భీమ్లా నాయక్`, `విరాటపర్వం` చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతోపాటు బాబాయ్ వెంకటేష్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు.
also read: క్లీవేజ్ అందాలతో రకుల్ న్యూ ఇయర్ సర్‌ప్రైజ్.. విరహాలు పోతూ హాట్ పోజులు