Chiranjeevi: ఇద్దరు కొట్టుకుంటే పంచాయతీ చేయను, ఇండస్ట్రీ పెద్దగా ఉండను.. తేల్చి చెప్పేసిన చిరంజీవి

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 02, 2022, 02:52 PM IST
Chiranjeevi: ఇద్దరు కొట్టుకుంటే పంచాయతీ చేయను, ఇండస్ట్రీ పెద్దగా ఉండను.. తేల్చి చెప్పేసిన చిరంజీవి

సారాంశం

దాసరి నారాయణ రావు మృతి తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. కష్టకాలంలో ఆదుకుంటూ, అవసరమైనప్పుడు సేవాకార్యక్రమాలు చేస్తూ వచ్చారు చిరంజీవి. దీనితో చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా భాద్యత తీసుకున్నారు అంటూ ప్రచారం జరిగింది.

దాసరి నారాయణ రావు మృతి తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. కష్టకాలంలో ఆదుకుంటూ, అవసరమైనప్పుడు సేవాకార్యక్రమాలు చేస్తూ వచ్చారు చిరంజీవి. దీనితో చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా భాద్యత తీసుకున్నారు అంటూ ప్రచారం జరిగింది. కానీ మోహన్ బాబు లాంటి వాళ్ళు దాసరి లేని లోటు అలాగే ఉందని.. ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద ఎవరూ లేరని చెబుతూ వచ్చారు. 

కానీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ అవసరం వచ్చినా చిరు దగ్గరికే వెళుతుండడం చూస్తూ ఉన్నాం. తాజా చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉండడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల వారికి లైఫ్ హెల్త్ కార్డులను పంపిణీ చేస్తోంది. టాలీవుడ్ లో అందరికి 50 శాతం రాయితీతో టెస్టులు చేస్తామని ప్రకటించింది. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో కార్డుల పంపిణీ జరగ్గా.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నేను ప్రతి వ్యవహారంలో పెద్ద ఉండను. పెద్దరికం ప్రదర్శించను. కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు మాత్రం ఖచ్చితంగా ముందుకు వస్తా. ఇండస్ట్రీకి పెద్దరికం చేయడం నాకు ఇష్టం లేదు. ఇండస్ట్రీ పెద్దగా ఉండే ప్రసక్తే లేదు. ఇద్దరు కొట్టుకుంటుంటే పంచాయతీలు చేయను అని చిరంజీవి అన్నారు. 

కానీ ఇండస్ట్రీ బిడ్డగా భాద్యతగా ఉంటాను. నా సాయం అవసరం అయినప్పుడు తప్పకుండా ఆదుకుంటాను అని చిరంజీవి తేల్చి చెప్పారు. చిరంజీవి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు ఊహించనివే అని చెప్పాలి. 

ఇటీవల టాలీవుడ్ చాలా సమస్యల్లో చిక్కుకుంది. ముఖ్యంగా కొరోనా ప్రభావంతో ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. దీనికి తోడు ఏపీలో టికెట్ ధరల వ్యవహారం నానుతూ ఉంది. టికెట్ ధరల విషయంలో చిరంజీవి ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. 

Also Read: మా ఆయన మంగళం శ్రీనులా కాదు.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో అనసూయ, శ్రీముఖి రచ్చ

PREV
click me!

Recommended Stories

2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా
ఎన్టీఆర్ 'సింహాద్రి'ని వద్దనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.? అస్సలు ఊహించలేరు