అభిమానుల సందర్శన కోసం గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ భౌతికకాయం.. ఏర్పాట్లు చేస్తున్న కుటుంబం..

Published : Nov 15, 2022, 11:27 AM IST
అభిమానుల సందర్శన కోసం గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ భౌతికకాయం.. ఏర్పాట్లు చేస్తున్న కుటుంబం..

సారాంశం

ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆదివారం అర్దరాత్రి దాటిన తర్వాత గుండెపోటుతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆదివారం అర్దరాత్రి దాటిన తర్వాత గుండెపోటుతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కాంటినెంటల్ ఆస్పత్రిలోనే కృష్ణ భౌతికకాయం ఉంది. కాసేపట్లో నానక్‌రామ్ గూడలోని నివాసానికి కృష్ణ భౌతికకాయాన్ని తరలించనున్నారు. ప్రముఖల సందర్శన కోసం కొన్ని గంటల పాటే కృష్ణ భౌతికకాయాన్ని ఇంటివద్దే ఉంచనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మధ్యాహ్నం సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. 

ఇంట్లో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం.. అభిమానుల సందర్శన కోసం గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ భౌతికకాయం తరలించనున్నారు. ఇందుకోసం కుటుంబ సభ్యుల పోలీసుల అనుమతితో గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏ టైమ్‌కు కృష్ణ భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తీసుకువస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

ఇక, సూపర్ స్టార్ కృష్ణ మరణంపై మీడియాతో మాట్లాడిన కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు.. పలు వివరాలను వెల్లడించారు. కృష్ణ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరడం జరిగిందన్నారు. ఆస్పత్రికి తీసుకురాకముందే ఆయన స్పృహ కోల్పోయారని చెప్పారు. 

‘‘ఆస్పత్రికి తీసుకొచ్చాక వెంటనే చికిత్స ప్రారంభించాం. ఆస్పత్రికితీసుకొచ్చినప్పటీ నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. 20 నిమిషాలు సీపీఆర్‌ చేశాం. అనంతరం ఐసీయూకు తరలించాం. రెండు మూడు గంటల్లో పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. 4  గంటల తర్వాత డయాలసిస్ చేశాం. గంట గంటకు కుటుం సభ్యులతో మాట్లాడాం. సాయంత్రం కృష్ణ ఆరోగ్యం మరింతగా విషమించింది. సాయంత్రం 8 గంటల సమయంలో  ఏ ట్రీట్‌మెంట్ చేసిన ఫలితం ఉండదనే నిర్దారణకు వచ్చాం. 

ఆయనను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా.. మన:శాంతిగా వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మంగళవారం తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ విషయంలో వైద్యనీతిని పాటించాం. ఆయనకు చికిత్స అందించడం మేము గౌరవంగా భావిస్తున్నాం. గుండెపోతు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో పాటు.. హైపాక్సిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ కూడా అయింది. ఆయన ఎలాంటి చికిత్సకు సహకరించే పరిస్థితి లేకపోవడంతోనే చికిత్సను ఆపేశాం. చివరి క్షణాల్లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం’’ అని వైద్యులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్