ఐటెం సాంగ్ విషయంలో సన్నీలియోన్ షాకింగ్ కండిషన్స్.. వాళ్ళు మాత్రం అస్సలు ఉండకూడదట

Published : Nov 09, 2022, 03:27 PM IST
ఐటెం సాంగ్ విషయంలో సన్నీలియోన్ షాకింగ్ కండిషన్స్.. వాళ్ళు మాత్రం అస్సలు ఉండకూడదట

సారాంశం

శృంగార తార సన్నీలియోన్ కి యువతలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె పేరు వింటేనే పులకరించిపోయే అభిమానులు ఉన్నారు.

శృంగార తార సన్నీలియోన్ కి యువతలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె పేరు వింటేనే పులకరించిపోయే అభిమానులు ఉన్నారు. పోర్ట్ స్టార్ గా గుర్తింపు పొందిన సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలలో రాణిస్తోంది. 

తెలుగులో కూడా సన్నీలియోన్ కరెంట్ తీగ అనే చిత్రంలో నటించింది. గరుడ వేగ మూవీలో ఐటెం సాంగ్ చేసింది. ప్రస్తుతం సన్నీలియోన్ పలు చిత్రాల్లో నటిస్తోంది. సన్నీలియోన్ చివరగా తెలుగులో మంచు విష్ణు సరసన జిన్నా చిత్రంలో నటించింది. ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 

శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్ తన గ్లామర్ తో యువతని ఎలా ఉడికిస్తుందో చెప్పనవసరం లేదు. ఐటెం సాంగ్స్ విషయంలో ప్రస్తుతం సన్నీ లియోన్ కొత్త కండిషన్స్ పెడుతోంది అట. ఐటెం సాంగ్ లో అందాలు ఆరబోసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదట. కానీ స్ట్రిక్ట్ రూల్స్ పాటించాలి అని అంటోంది. 

తమిళ దర్శకుడు జయ మురుగన్ 'తీ ఇవన్' అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఐటెం సాంగ్ కోసం సన్నీలియోన్ ని సంప్రదించారట. సాంగ్ చేసేందుకు ఒకే చెప్పిన సన్నీ.. తన షరతుల చిట్టా విప్పింది. తాను ఐటెం సాంగ్ చేస్తున్నప్పుడు సెట్స్ లో చిన్న పిల్లలు ఎవరూ ఉండకూడదు అట. అలాగే కోవిడ్ నిబంధనలు పాటించాలి. తన కో డ్యాన్సర్లకి కూడా తగిన గౌరవం ఇవ్వాలి అని తెలిపిందట. 

సన్నీ లియోన్ కి ఉన్న డిమాండ్ తో దర్శకుడు అన్ని కండిషన్స్ కి ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఐటెం సాంగ్ యువతని వేడెక్కించే విధంగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి