
మంగళవారం బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఇంటి సభ్యులకు పాము, నిచ్చెన టాస్క్ ఇవ్వడం జరిగింది. కెప్టెన్సీ టాస్క్ నెక్స్ట్ లెవల్ లో భాగంగా నాగమణి టాస్క్ పెట్టారు. ఇంటి సభ్యులు రెండు టీమ్స్ గా విడిపోవాలి. ఒక టీమ్ సభ్యులు తమకు ఇచ్చిన రత్నాలను ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరొక టీమ్ సభ్యులు వారి దగ్గర నుండి వాటిని తెచ్చుకోవాలి. ఈ టాస్క్ లో రేవంత్ నాగమణులు కాపాడుకునే టీమ్ లో ఉన్నాడు. మణులు తెచ్చుకొనే టీమ్ లో ఉన్న కీర్తిని రేవంత్ పెనుగులాటలో గుద్దాడు. గుద్దటం ఏమిటని కీర్తి రేవంత్ ని అడిగింది.
రేవంత్ మణులు కాపాడుకునే క్రమంలో చాలా అగ్రెసివ్ గా గేమ్ ఆట ఆడాడు. అమ్మాయిలని కూడా చూడకుండా నెట్టేశాడు. ఆది రెడ్డి రేవంత్ ని హెచ్చరించాడు. గేమ్ ఒక్కటే ముఖ్యం కాదు దెబ్బలు తగిలేలా ఉన్నాయి చూసుకో అని రేవంత్ తో అన్నాడు.దానికి రేవంత్ కి కోపం వచ్చింది. నా దగ్గర లాక్కుంటున్నారు. ఫిజికల్ అయ్యానని ఎవరైనా అంటే తోలు తీసేస్తా అని రేవంత్ అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. గత వారం రేవంత్ టాస్క్స్ లో ఇదే తరహా ప్రవర్తన చూపాడు. దానికి నాగార్జున ఎల్లో కార్డు ఇచ్చాడు.
ఎల్లో కార్డు ఇచ్చిన నాగార్జున గేమ్ లో అగ్రెసివ్ నెస్ ఉండాల్సిందే. కాకపోతే ఇంటి సభ్యులకు దెబ్బలు తగలకుండా చూసుకో అన్నాడు. అవేమీ రేవంత్ కి పట్టడం లేదు. గెలిచే క్రమంలో అతని కోపం హద్దులు దాటేస్తుంది. రేవంత్ ప్రవర్తనను నాగార్జున ఎలా జడ్జి చేస్తారో వచ్చేవారం చూడాలి.
ఇక ఎలిమినేషన్స్ లో తొమ్మిది మంది ఉన్నారు. రేవంత్, బాల ఆదిత్య, వాసంతి, కీర్తి, శ్రీహాన్, ఇనయా, ఫైమా, మెరీనా నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం హౌస్ వీడనున్నారు. కాగా లేటెస్ట్ ఎలిమినేషన్ తో గీతూ హౌస్ వీడిన విషయం తెలిసిందే. ఆమెను వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతుంది.