
యాక్షన్ కింగ్ అర్జున్ కు.. యంగ్ టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కు గత కొద్ది కాలంగా జరుగుతున్న వివాదం తెలిసిందే. అర్జున్ తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్ కు పరిచయం చేస్తూ.. స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. పోయిన జూన్‌లో పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది ఈమూవీ. ఫస్ట్ షెడ్యూల్ అయిన తరువాత రీసెంట్ గా అర్జున్-విశ్వక్‌కు మధ్య విభేదాలు రావడంతో ఈ సినిమా కాన్సిల్ అయింది.
ఇక ఈ వివాదం వేడి తగ్గింది అనుకున్నారు అంతా. అయితే టాలీవుడ్ టాక్ ప్రకారం.. అర్జున్ విశ్వక్ కు షాక్ ఇచ్చిలా మరో టాలీవుడ్ యంగ్ హీరోను ఈసినిమాకు తీసుకోబోతున్నాడట యాక్షన్ కింగ్ అర్జున్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరో గురించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అర్జున్ ఈ సినిమాను యంగ్ స్టార్ శర్వానంద్‌తో తెరకెక్కించాలని ఆసక్తి చూపుతున్నాడట. ఈ కథ శర్వాకు బాగా సెట్టవుతుందని భావిస్తున్నాడుట. అంతేకాకుండా త్వరలోనే శర్వాతో ఈ సినిమా గురించి చర్చించనున్నట్లు టాక్.
శర్వానంద్ రీసెంట్ గా ఒకే ఒక జీవితం సినిమాతో చాలా కాలం తరువాత మంచి హిట్ కొట్టాడు. దాదాపు డబుల్ హ్యాట్రిక్ ప్లాప్ ల తరువాత ఈ సినిమా శర్వాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలో శర్వా కథల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ కథను ఆయన ఒప్పుకుంటాడా అని సందేహం వ్యాక్తం అవుతుంది. ఇకప్పటికే ఏవైనా కథలు శర్వానంద్ దగ్గరకు వస్తే.. ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాడట. ఈ క్రమంలో అర్జున్ కథను శర్వా యాక్సెప్ట్ చేస్తాడా..? ఇదే సందేహం ఉంది అందరిలో.
ప్రస్తుతం శర్వానంద్ కృష్ణ చైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడు గతంలో ఛల్ మోహనరంగా సినిమా చేశారు ఈ దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. అంతే కాదు ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇక గత నాలుగైదు రోజులుగా టాలీవుడ్‌లో అర్జున్ - విశ్వక్ సేన్ వివాదం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ విషయంలో ఎవరి వర్షన్ వారు చెపుతున్నారు. అర్జున్ మాట్లాడుతూ... అర్జున్, విశ్వక్ సేన్‌కు కమిట్‌మెంట్ లేదని, తన 40ఏళ్ల ఇండస్ట్రీ కెరీర్‌లో ఇలాంటి వ్యక్తిని చూడలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు యాక్షన్ కింగ్. తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. విశ్వక్ వల్ల కొత్తవారికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అన్నట్టుగామాట్లాడారు అర్జున్.
అయితే దీనిపై విశ్వక్ కూడా స్పందించారు. తాను ఏతప్పు చేయలేదని. అసలు హీరోగా తనకు ఏ విలువా ఇవ్వలేదని. తాము చెప్పింది చేసి.. నోరు మూసుకుని వెళ్లడం అంటే అది నావల్ల కాదు అన్నారు. తన అంత కమిటెడ్ ఎవరు ఉండరని, తను కొన్ని చేంజెస్ చెప్తే చెయలేదని, అయినా తన వల్ల ఇబ్బంది ఉంటే క్షమించండి అని వెల్లడించారు. అంతే కాదు తన రెమ్యూనరేషన్ విషయం.. బాండ్స్ ను కూడా రిటర్న్ చేశారు విశ్వక్. నిర్మాతల మండలికి కూడా పంపించారు.