Bigg Boss Telugu 5: ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టిన టీషర్ట్స్.. షూట్‌ చేసుకుని స్విమ్మింగ్ పూల్లో పడ్డ సన్నీ

Published : Nov 17, 2021, 11:36 PM IST
Bigg Boss Telugu 5: ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టిన టీషర్ట్స్.. షూట్‌ చేసుకుని స్విమ్మింగ్ పూల్లో పడ్డ సన్నీ

సారాంశం

సంచాలక్‌ రవి ఇచ్చిన తీర్పు నచ్చని సన్నీ ఆవేశానికి గురయ్యాడు. సర్ది చెప్పే ప్రయత్నం చేసిన మానస్‌, కాజల్‌ లపై ఫైర్‌ అయ్యాడు సన్నీ. దీంతో హౌజ్‌ మొత్తం మరోసారి హీటెక్కింది. 

బిగ్‌బాస్‌ తెలుగు 5 (Bigg Boss Telugu 5) పదకొండో వారంలో రచ్చ మరోసారి షురూ అయ్యింది. కెప్టెన్సీ గేమ్‌లో మరోసారి కోపానికి గురయ్యాడు సన్నీ(Sunny). టిషర్ట్ ధరించి స్విమ్మింగ్‌ పూల్‌లో అటు నుంచి ఇటు వెళ్లే టాస్క్ లో Sunny రెచ్చిపోయాడు. దీంతో సంచాలక్‌ రవి(Ravi) ఇచ్చిన తీర్పు నచ్చని సన్నీ ఆవేశానికి గురయ్యాడు. సర్ది చెప్పే ప్రయత్నం చేసిన మానస్‌, కాజల్‌ లపై ఫైర్‌ అయ్యాడు సన్నీ. దీంతో హౌజ్‌ మొత్తం మరోసారి హీటెక్కింది. ఇక 73వ రోజు(74వ ఎపిసోడ్‌)లో `మీ ఇళ్లు బంగారం కాను` టాస్క్ కంటిన్యూ అయ్యింది. ఇంటి సభ్యులు గేమ్‌ గురించి రకరకాలుగా డిస్కషన్స్ పెట్టుకున్నారు. 

ఎక్కువ గోల్డ్ గుండ్లు సాధించిన వారిలో సిరి(Siri), సన్నీ టాప్‌లో ఉన్నారు. దీంతో వీరిద్దరి మధ్య కెప్టెన్సీ  మొదటి పోటీ దారుల టాస్క్ జరిగింది. అందులో భాగంగా స్విమ్మింగ్‌ పూల్‌ కి అటు వైపు, ఇటు వైపు టీషర్ట్స్ ఉంటాయి. ఓ టీ షర్ట్ ధరించి స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి అటు వైపు వెళ్లాలి, అక్కడ మరో టీషర్ట్ ధరించి స్విమ్ చేస్తూ ఇటు వైపుకి చేరాలి. ఇక్కడ ఉన్న టీషర్ట్ ధరించి మళ్లీ అటు వెళ్లాలి. బిగ్‌బాస్‌ బజర్‌ మోగే వరకు ఎవరు ఎక్కువ టీషర్ట్ ధరిస్తారో వాళ్లు కెప్టెన్సీ పోటీదారులకు అర్హత సాధిస్తారు. 

ఇందులో సన్నీ, సిరి పోటీ పడాల్సి ఉంది. కానీ సిరి స్విమ్మింగ్‌ చేయడం ఇబ్బంది ఉందని, తన స్థానంలో మరొకరు టాస్క్ లో పాల్గొనే అవకాశం ఉందా? అని కెప్టెన్‌ రవి కోరడంతో అందుకు బిగ్‌బాస్‌ ఒప్పుకున్నారు. తన తరఫున పోటీలో పాల్గొనే వారు గెలిస్తే సిరి గెలిచినట్టే. ఇందులో సిరి స్థానంలో మానస్‌ వెళ్లాడు. సన్నీ, మానస్‌ పోటీలో పాల్గొన్నారు. ఇందులో సన్నీ వేగంగా ఎక్కువ టీషర్ట్స్ ధరించాడు. కాకపోతే తాను ధరించిన టీషర్ట్స్ సరిగ్గా ధరించకపోవడంతో ఐదు ఫెయిల్‌ అయ్యాయి. దీంతో 22 టీషర్ట్ లను ప్రాపర్‌గా ధరించిన మానస్‌ విజేతగా నిలిచాడు. 

అయితే తాను ధరించే టీషర్ట్ లకు లేబుల్‌ సరిగా లేదని, ముందు నుంచే లేబుల్స్ సరిగా చూసుకుని టీషర్ట్ ధరించాలని సంచాలక్‌ చెప్పలేదని వాపోయాడు సన్నీ. ఈ విషయంలో గొడవ ప్రారంభమైంది. సన్నీ తన వాదననే వినిపిస్తూ వచ్చాడు. ప్రతిసారి తననే ఇలా చేస్తున్నారని, ఫైర్‌ అయ్యాడు. రవి చెప్పినా వినలేదు. కాజల్‌ చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఫ్రెండ్స్ కూడా ఇలా చేస్తారా? అంటూ మానస్‌ని ఉద్దేశించి మండిపడ్డాడు సన్నీ. దీంతో మరోసారి మానస్‌, కాజల్‌, ప్రియాంకలు ఆయన్ని సముదాయించే ప్రయత్నం చేయగా, అలానే ఫైర్‌ అవుతున్నాడు. 

దీంతో సిరి బాధపడింది. తననే టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతున్నాడని.. షణ్ముఖ్‌తో అన్నది సిరి. తాను ఈ గేమ్‌లో పాల్గొనాల్సి ఉందని వాపోయింది. మరోవైపు సన్నీకి, కాజల్‌,మానస్‌లకు మధ్య గొడవ జరుగుతూనే ఉంది. సన్నీ తన ఫ్రస్టేషన్‌ వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. మొత్తానికి టీషర్ట్స్ ఫ్రెండ్స్ మధ్య చిచ్చుపెట్టినట్టయ్యింది. చివరికి మళ్లీ స్విమ్మింగ్‌ పూల్‌లో దూకాడు. అంతేకాదు అనీ మాస్టర్‌తో సైగలు చేస్తూ చివరికి తనని తాను షూట్‌ చేసుకున్నట్టు యాక్షన్‌ చేస్తూ స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయాడు సన్నీ. ఇలా బుధవారం ఎపిసోడ్‌ ముగిసింది.

also read: Bigg Boss Telugu 5: ట్రైలర్ లోనే అసభ్యంగా.. సిరిపై నటుడి హాట్ కామెంట్స్, హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తే..

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి