సన్నీ డియోల్‌ ‘జాట్‌’ ట్రైలర్‌, లాస్ట్ డైలాగు మాత్రం కేక!

బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లో సన్నీ డియోల్‌తో ‘జాట్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది, ఇందులో పవర్‌ఫుల్ డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి.

Sunny Deol, Randeep Hooda Jaat Trailer Out  in Telugu jsp


 బాలకృష్ణతో  ‘వీరసింహారెడ్డి’ అంటూ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ స్టార్ యాక్టర్ సన్నీ డియోల్‌తో ‘జాట్’ మూవీ చేస్తున్నాడు. ఇందులో డియోల్ సరసన సయామీ ఖేర్, రెజీనా కాసాండ్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణదీప్‌ హుడా, వినీత్‌ కుమార్‌ సింగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈసినిమా హిందీ ట్రైలర్‌ (JAAT Trailer)ను చిత్ర టీమ్ విడుదల చేసింది.

Latest Videos

 పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు, యాక్షన్‌ సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ సాగింది. ‘ఈ లంకలోకి అడుగుపెట్టేందుకు భగవంతుడు కూడా భయపడతాడు’ అంటూ విలన్  పాలించే ప్రాంతం గురించి రెజీనా చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో  ‘నిన్ను, నీ లంకను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’, ‘ఈ చేతికి ఉన్న పవరేంటో మొత్తం ఉత్తరాది చూసింది. ఇప్పుడు దక్షిణాది చూడనుంది’ అంటూ సన్నీదేవోల్‌ చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ ఆయన అభిమానులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఏప్రిల్‌ 10న ఈసినిమా విడుదల కానుంది.

vuukle one pixel image
click me!