ఫన్, యాక్షన్ ఫెరఫెక్ట్ మిక్స్: ‘రాబిన్‌హుడ్‌’ ట్రైలర్ చూసారా?

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్‌హుడ్' చిత్రం ఈనెల 28న విడుదల కానుంది. డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

Nithiin Sreeleela Robinhood movie Trailer released in Telugu


‘‘కరోనా వస్తే క్వారంటైన్‌ 14రోజులే. కానీ, నేనొస్తే జీవితాంతం’’ అంటూ వచ్చేసారు హీరో  నితిన్‌. ఇప్పుడాయన.. శ్రీలీల జంటగా వెంకీ కుడుముల రూపొందించిన చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా ఈనెల 28న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా డేవిడ్‌ వార్నర్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. తనని ఈ చిత్రంలో భాగం చేసినందుకు చిత్ర టీమ్ కి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, తప్పకుండా అందరికీ నచ్చుతుందని వార్నర్‌ అన్నారు.

Latest Videos

ఈ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ మరో ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది. ‘రాబిన్ హుడ్’ సినిమాలో డేవిడ్ వార్నర్ సెకండ్ హాఫ్‌లో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లోనూ వార్నర్ కనిపించాడు. హెలికాప్టర్ నుంచి దిగుతూ, లాలీపాప్ తింటూ నడుస్తున్న సన్నివేశంలో అతను కనిపించడం అభిమానులను ఉత్సాహపరచింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. రాబిన్ హుడ్ ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. నితిన్ మార్క్ యాక్షన్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్‌ల కామెడీ, శ్రీలీల గ్లామర్ ఇలా అన్ని రోల్స్ సినిమా పట్ల ఆసక్తిని పెంచాయి. 

vuukle one pixel image
click me!