సునీల్ అంత పీనాసి చక్రవర్తా?

By Surya PrakashFirst Published Jul 14, 2021, 2:13 PM IST
Highlights

కమెడియన్ సునీల్ హీరోగా మారిన తర్వాత ప్రేక్షకులకు పెద్దగా ఎక్కటం లేదు.  వరుసగా ఫ్లాపులు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత చాలా రోజులు సినిమాల్లో కనిపించలేదు. గత కొన్ని రోజుల నుండి మళ్ళీ కమెడియన్ పాత్రలు చేస్తున్న సునీల్, నిలదొక్కుకోలేకపోతున్నాడు. తాజాగా ఎఫ్ 3 సినిమాలో ఓ విలక్షణమైన పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది.

గతంలో వెంకటేష్ -వరుణ్ తేజ్ లతో కలిసి ఎఫ్ 2 అనే సినిమా చేసాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాలో వెంకీ -వరుణ్ కామెడీ సినిమాకే హైలైట్. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు అనిల్. ఈ సినిమాలో వెంకీ వరుణ్ లతోపాటు మరో హీరో కూడా ఉండనున్నాడు. అయితే ఈ మూడో హీరో ఎవరో కాదు ఒకప్పుడు కమెడియన్ గా అలరించి ఈ మధ్య హీరోగా మారిన సునీల్. ఈ సినిమాలో సునీల్ కు ఓ విభిన్నమైన పాత్ర ఇవ్వబోతున్నారట. అది పరమ పీనాసి పాత్ర అని తెలుస్తోంది. 

ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి...అహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు వేసిన అతి పిసినారి పాత్రని ఎఫ్ 3 లో సునీల్ తో చేయిస్తున్నారట. సునీల్ పిసినారి పాత్రే ఎఫ్ 3కి హైలెట్ గా చెబుతున్నారు. ఆ పాత్ర సినిమాకే హైలెట్ అవుతుందిట. వెంకీ, వరుణ్ తేజ లకు సునీల్ ..ఓ రెస్టారెంట్ పెట్టుకుంటానంటే వడ్డీకు అప్పు ఇస్తాడని, అయితే వాళ్లు దివాళా తీస్తారని ..దాంతో వడ్డీతో సహా తన అప్పు తీర్చమని సునీల్ వెంటబడతారని తెలుస్తోంది. రోజు రోజుకీ వడ్డీ పెంచేసే పాత్రలో సునీల్ తన నటనా విశ్వరూపాన్ని చూపబోతున్నారట. 

ఇక  ఈ పాత్ర కోసం ముందుగా రాజేంద్రప్రసాద్ ను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆపాత్రలో సునీల్ కనిపించనున్నాడు. ఇక ఎఫ్ 3 సినిమా డబ్బు చుట్టూ తిరుగుతుందని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు చూస్తుంటే అర్ధమవుతుంది.  ఎఫ్ 3  షూట్ ఈమధ్యనే మొదలైంది.  శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా తాత్కాలికంగా వాయిదాపడి.. మళ్లీ పరిస్థితులు అదుపులోకి వచ్చాక కొంతకాలం క్రితం తిరిగి ప్రారంభమైంది.
 

click me!