'కేజీయఫ్ 2': ఈ వార్త వింటే యష్ ఫ్యాన్స్ గోలెత్తిపోతారు

By Surya PrakashFirst Published Jul 14, 2021, 12:59 PM IST
Highlights

 రిలీజ్ కు ముందే కేజీఎఫ్ చాప్టర్-2 సంచలనాలు సృష్టిస్తోంది. లాక్ డౌన్,సెకండ్ వేవ్ లేకుండా ఉంటే ఈ పాటికే విడుదల కావాల్సి ఉన్న ఈ భారీ చిత్రానికి సంబందించిన ఓ అప్డేట్ ఇప్పుడు సినీ లవర్స్ ని ఉత్సాహపరుస్తోంది. అదేమిటంటే ...

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో 'కేజీఎఫ్‌2' ఒకటి. ప్రశాంత్‌ నీల్‌ దర్వకత్వంలో కన్నడ రాకింగ్‌ స్టార్‌ యష్‌ హీరోగా నటించిన కేజీఎఫ్ కు సీక్వెల్ ఇది.  ఈ పీరియాడికల్‌ ఎంటర్‌టైనర్‌ కోసం అన్నిబాషల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారనటంలో సందేహం లేదు. ఈ సినిమాపై మరింత ఆస‌క్తి రేపిన అంశం.. అధీరా లుక్‌. అధీరా పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్నారు. ఈ భూమిపై క్రూరత్వానికి పరాకాష్ఠ అని ఎవరినైనా అంటే అది అధీరా మాత్రమే అంటున్నాడు దర్శకుడు ప్రశాంత్‌నీల్. విలన్ పాత్ర కోసం వెతుకుతున్న సమయంలో మొదట గుర్తుకు వచ్చింది సంజయ్ దత్ మాత్రమే అన్నాడు. 

కరోనా గొడవ లేకపోతే ఈ సినిమా రిలీజ్ కు ముస్తాబు అవుతూండేది.  రిలీజ్ కు ముందే కేజీఎఫ్ చాప్టర్-2 సంచలనాలు సృష్టిస్తోంది. పెద్ద మొత్తంలో ప్రి రిలీజ్ బిజినెస్ చేస్తోంది. తాజాగా ఆడియో హక్కుల విషయంలోనూ రికార్డులను బద్ధలు కొట్టింది. లాక్ డౌన్,సెకండ్ వేవ్ లేకుండా ఉంటే ఈ పాటికే విడుదల కావాల్సి ఉన్న ఈ భారీ చిత్రానికి సంబందించిన ఓ అప్డేట్ ఇప్పుడు సినీ లవర్స్ ని ఉత్సాహపరుస్తోంది. అదేమిటంటే  అధీర కోసం స్పెషల్ ఇంట్రడక్షన్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్.

 విలన్ ను ఇంట్రడ్యూస్  చేస్తూ సాగే ఈ సాంగ్ సినిమాకి హైలెట్ గా నిలవనుందట. హై వోల్టేజ్ తో అద్భుతమైన విజువల్స్ చూపిస్తూ ఈ సాంగ్ ఉండనుందట. అలాగే సంజయ్ దత్ కు రవిశంకర్ డబ్బింగ్ చెప్పబోతున్నారని కూడా తెలుస్తోంది. ఇక సినిమా మొత్తంలో యశ్ పాత్ర కంటే సంజయ్ పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని… హైలెట్ అవుతుందని తెలుస్తోంది. మరి యశ్ తో సమానమైన పాత్ర అంటేనే ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఇక యశ్ ని మించిపోయే క్యారక్టర్, అందలోనూ ఇంట్రడక్షన్ సాంగ్ అంటే గోలెత్తిపోరూ. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చ‌ల‌న చిత్రం విడుద‌ల చేస్తుంది. ఈ చిత్రానికి ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

click me!