పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాల్సిన 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ ఆలస్యం అవుతుండడంతో ఈ గ్యాప్ లో ఓ సినిమా చేయాలని Harish Shankar భావించారు. సునీల్ హీరోగా 'వేదాంతం రాఘవయ్య' అనే చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది.
నటుడు సునీల్ టాలీవుడ్ లో కమెడియన్ గా చాలా కాలం పాటు ఓ వెలుగు వెలిగాడు. బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ లాంటి కామెడియన్లకు బలమైన పోటీ ఇచ్చాడు సునీల్. కొంతకాలం తర్వాత సునీల్ హీరోగా అవకాశాలు వచ్చాయి. ప్రారంభంలో విజయాలు కూడా దక్కాయి. దీనితో సునీల్ కామెడీ రోల్స్ కి స్వస్తి చెప్పి ఫుల్ టైం హీరోగా టర్న్ తీసుకున్నాడు.
అప్పుడే Sunil అదృష్టం అడ్డం తిరిగింది. సునీల్ హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా కొడుతూ వచ్చాయి. కొన్ని రోజులకు హీరోగా సునీల్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. దీనితో సునీల్ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్, విలన్ పాత్రలు, కామెడీ రోల్స్ చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా సునీల్ కు హీరోగా మరో మంచి అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాల్సిన 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ ఆలస్యం అవుతుండడంతో ఈ గ్యాప్ లో ఓ సినిమా చేయాలని Harish Shankar భావించారు. సునీల్ హీరోగా 'వేదాంతం రాఘవయ్య' అనే చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. కొన్ని నెలల క్రితమే ఈ చిత్రానికి ప్రకటన వచ్చింది.
ఈ మూవీ కి స్వయంగా హరీష్ శంకర్ కథ అందిస్తున్నారు. సి.చంద్రమోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. అనుకోని విధంగా ఈ చిత్రం నుంచి సునీల్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో మేకర్స్ సునీల్ ప్లేస్ లోకి యువ నటుడు Satyadev ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
అయితే సునీల్ ఈ చిత్రం నుంచి ఎందుకు తప్పుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సునీల్ ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకుంటున్నాడు. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో సునీల్ విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇక యువ హీరో సత్యదేవ్ కూడా మంచి కథలు ఎంచుకుంటూ క్రేజ్ సొంతం చేసుకుంటున్నాడు.