Bigg boss telugu 5: తండ్రైన బిగ్ బాస్ ఫేమ్ నటరాజ్ మాస్టర్

Published : Nov 19, 2021, 04:54 PM ISTUpdated : Nov 19, 2021, 04:55 PM IST
Bigg boss telugu 5: తండ్రైన బిగ్ బాస్ ఫేమ్ నటరాజ్ మాస్టర్

సారాంశం

బిగ్ బాస్ హౌస్ లోకి నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చే నాటికి భార్య నిండు గర్భవతి. భార్య సీమంతం ఆయన హౌస్ లో ఉన్నప్పుడు స్నేహితులు నిర్వహించారు. 


కొరియాగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ (Natraj master) తండ్రిగా మారారు . ఆయన భార్య పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తన సంతోషం ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 5 లో డాన్స్ కొరియాగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ పాల్గొన్న విషయం తెలిసిందే. తన అగ్రిసివ్ బిహేవియర్ తో నటరాజ్ మాస్టర్, హౌస్ లో తన మార్క్ క్రియేట్ చేశారు. ఏది ఏమైనా ఆయన ఆట ప్రేక్షకులకు నచ్చకపోవడంతో హౌస్ నుండి బయటికి పంపివేశారు.

 ఇక బయటికి వచ్చిన నటరాజ్ తన ప్రొఫెషన్ లో బిజీ అయ్యారు. కాగా బిగ్ బాస్ హౌస్ (Bigg boss season 5)లోకి నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చే నాటికి భార్య నిండు గర్భవతి. భార్య సీమంతం ఆయన హౌస్ లో ఉన్నప్పుడు స్నేహితులు నిర్వహించారు. టీవీ సెలెబ్రిటీలు ఈ సీమంతం వేడుకలో పాల్గొనడం జరిగింది. కాగా ఆమెకు నెలలు నిండడంతో నిన్న పాపకు జన్మనిచ్చారు. నటరాజ్ మాస్టర్ కి అమ్మాయి పుట్టిన విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. ఇక తన సన్నిహితులు, బిగ్ బాస్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నట్లు నటరాజ్ మాస్టర్ తెలియజేశాడు. నటరాజ్ మాస్టర్ ది లవ్ మ్యారేజ్.

 కాగా, తన అసిస్టెంట్ ని వివాహం చేసుకున్నాడుకాగా తొమ్మిదవ వారం హౌస్ నుండి ఎలిమినేటైన విశ్వపై నటరాజ్ మాస్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గుంట నక్క, మోసగాడు అంటూ అవమానకరంగా మాట్లాడాడు. అయితే ఈ విషయంలో నటరాజ్ మాస్టర్ ట్రోల్స్ కి గురయ్యారు. 

Also read Bigg boss telugu 5: ఆ కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ కి!

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. నాలుగు వారాల్లో షో ముగియనుంది. దీనితో హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. కాగా బిగ్ బాస్ ఓ కంటెస్టెంట్ కి నేరుగా ఫైనల్ కి వెళ్లే అవకాశం కల్పించారు. బిగ్ బాస్ సీజన్ 5లో మొత్తం 19మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా.. 9తొమ్మిది మంది ఎలిమినేట్ అయ్యారు. ఆరోగ్య కారణాలతో 10వ కంటెస్టెంట్ జెస్సీ హౌస్ ని వీడడం జరిగింది. ఇక మిగిలిన 9మంది కంటెస్టెంట్స్ నుండి ఐదుగురు ఫైనల్ కి నలుగురు ఎలిమినేటై హౌస్ నుండి బయటికి రానున్నారు. ఫైనల్ సమీపిస్తున్న నేపథ్యంలో హౌస్ లో టాస్క్ లు కూడా రసవత్తరంగా మారాయి. 

Also read Bigg Boss Telugu 5: దీప్తి గుర్తుల్లో షణ్ముఖ్‌.. సిరి కన్నీళ్లు.. రవి నారదుడు.. బిగ్‌బాస్‌కి సన్నీ మొర
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే