
బాహుబలి సినిమాకు ఖాన్ స్పందన వచ్చేసింది. బాహుబలి సాధించిన కలెక్షన్ల రికార్డును.. చైనా రిలీజ్ తో క్రాస్ చేసిన ఆమిర్ ఖాన్ దంగల్ సినిమా చైనాలో వెయ్యికోట్లు కలెక్షన్లు సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఈ చిత్రం చైనాలో ఘనవిజయం సాధించడంతో బాహుబలి సాధించిన రికార్డులు కొన్ని క్రాస్ చేసింది. అయితే భారత్ లో 1000 కోట్ కలెక్షన్స్ సాధించిన మొట్టమొదటి సినిమాగా బాహుబలి రికార్డు మాత్రం ఇప్పట్లో ఎవరూ క్రాస్ చేసే పరిస్థితి లేదు. ఇటు బాహుబలి, అటు దదంగల్ చిత్రాలు రెండూ ఓవరాల్ గా... 1500 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటి భారత సినీ పరిశ్రమలో సంచలనాలు నమోదు చేశాయి. ప్రస్తుతం చైనాలో వెయ్యి కోట్ల కలెక్షన్స్‌కు చేరువలో ఉంది ఆమిర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా.
తాజాగా ‘సచిన్: ఎ బలియన్ డ్రీమ్స్’ ప్రీమియర్ షోకు వచ్చిన ఆమిర్.. ఈ రెండు సినిమాల గురించి మాట్లాడారు. ‘చైనాలో ‘దంగల్’ సినిమాకు వస్తున్న ఆదరణ నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. మా సినిమాకు, ‘బాహుబలి: ది కంక్లూజన్’కు అసలు పోలికే లేదు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాను నేను ఇంకా చూడలేదు. కానీ, రిపోర్ట్స్ మాత్రం వింటున్నాను. ఇంతటి విజయం సాధించిన రాజమౌళికి, అతని టీమ్‌కు నా అభినందనలు.
ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు భారత సినిమాలు సంచలనం నమోదు చేయడం చాలా ఆనందంగా ఉంది. అంతమాత్రాన ఈ రెండింటినీ పోల్చలేం. దేని స్పేస్ దానికి ఉంది. ‘బాహుబలి’ సాధించిన విజయం కూడా నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింద’ని పేర్కొన్నారు ఆమిర్ ఖాన్.