సునీల్ ని సైడ్ చేసేశారా..?

By Udayavani DhuliFirst Published Nov 15, 2018, 11:09 AM IST
Highlights

నటుడు సునీల్ హీరోగా అవకాశాలు తగ్గడంతో తిరిగి కమెడియన్ గా మారిపోయాడు. ఈ క్రమంలో అతడు నటించిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపును తీసుకురాలేకపోయాయి. 'అరవింద సమేత' సినిమాలో సునీల్ కామెడీ సీన్లను చిత్రీకరించినప్పటికీ సినిమా సీరియస్ మోడ్ లో సాగడం బెటర్ అని భావించిన త్రివిక్రమ్..

నటుడు సునీల్ హీరోగా అవకాశాలు తగ్గడంతో తిరిగి కమెడియన్ గా మారిపోయాడు. ఈ క్రమంలో అతడు నటించిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపును తీసుకురాలేకపోయాయి.

'అరవింద సమేత' సినిమాలో సునీల్ కామెడీ సీన్లను చిత్రీకరించినప్పటికీ సినిమా సీరియస్ మోడ్ లో సాగడం బెటర్ అని భావించిన త్రివిక్రమ్.. సునీల్ సీన్లను ఎడిట్ చేసేశాడు. ఆ సినిమా హిట్ అయినప్పటికే సునీల్ కి పెద్దగా ఒరిగిందేమీ లేదనే చెప్పాలి.

ఇప్పుడు సునీల్ ఆశలన్నీ 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాపైనే. అయితే ఈ సినిమాలో కూడా సునీల్ పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత ఉండదంటున్నారు. శ్రీనువైట్ల గతంలో తను తెరకెక్కించిన చిత్రాల్లో సునీల్ కోసం స్పెషల్ ట్రాక్ లు రాసేవాడు.

కానీ ఈ సినిమాలో మాత్రం కమెడియన్ సత్యకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి అతడి కోసం హిలారియస్ రోల్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో సునీల్, సత్యలే కాకుండా శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి ఇలా చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. మరి వీరందరినీ దాటుకొని సునీల్ తన మార్క్ కామెడీ ఎలా పండిస్తాడో చూడాలి. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

రూ.4 లక్షలు ఇస్తేనే.. లేదంటే.. సునీల్ డిమాండ్!

రవితేజకి అసిస్టెంట్ గా మారిన సునీల్!

click me!