ఎన్నికల బరిలో కమెడియన్ వేణుమాధవ్..!

By Udayavani DhuliFirst Published Nov 15, 2018, 10:17 AM IST
Highlights

ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్ రాబోయే ఎలెక్షన్స్ లో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకి వెల్లడించారు. గురువారం ఉదయం 11 గంటలకు తన నామినేషన్ స్వయంగా వేయనున్నట్లు వెల్లడించారు. 

వేణుమాధవ్ సొంతూరు కోదాడ. అక్కడే చదువు పూర్తి చేసుకొని.. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తరువాత టీడీపీ పార్టీ ఆవిర్భవించడంతో ఆ పార్టీ సభల్లో పాల్గొని తన మిమిక్రీ ద్వారా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.

ఆయన టీడీపీకి వీరాభిమాని. నారా చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన టీడీపీ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తారనుకుంటే  అనూహ్యంగా కోదాడ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా ఈరోజు నామినేషన్ వేయనున్నారు.

కమెడియన్ గా కొన్ని వందల చిత్రాల్లో నటించిన వేణుమాధవ్ రాజకీయ నేపధ్యం గల కుటుంబానికి చెందినవారే. తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు.   

Last Updated Nov 15, 2018, 10:17 AM IST