కమెడియన్ పాత్రకు రూ.కోటి రెమ్యునరేషన్!

First Published 1, Aug 2018, 6:12 PM IST
Highlights

తన పాత్ర సినిమాకు కీలకంగా ఉండడంతో పాటు అందరినీ నవ్వించే క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఈ సినిమాకు సునీల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే విషయం ఇప్పుడు షాకింగ్ గా మారింది

కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను అలరించిన సునీల్ ఆ తరువాత 'మర్యాదరామన్న' చిత్రంతో హీరోగా మారాడు. ఇక అప్పటినుండి హీరోగా వరుస సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. హీరోగా అతడికి ఆఫర్లు వస్తున్నా.. సరైన బ్రేక్ మాత్రం దక్కలేదు. వరుస ఫ్లాపులు పడుతున్నా.. హీరోగా సినిమాలు చేయడం మాత్రం మానలేదు. మలయాళీ సినిమా 'టు కంట్రీస్' ను రీమేక్ చేసినా వర్కవుట్ కాలేదు.

దీంతో రూట్ మార్చి కమెడియన్ గా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సునీల్ మంచి అవకాశాలే దక్కుతున్నాయి. స్టార్ హీరో తమ సినిమాల్లో కమెడియన్ పాత్ర కోసం సునీల్ కు ఛాన్స్ ఇస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న 'అరవింద సమేత' సినిమాలో సునీల్ కు మంచి పాత్ర దక్కిందని సమాచారం. తన పాత్ర సినిమాకు కీలకంగా ఉండడంతో పాటు అందరినీ నవ్వించే క్యారెక్టర్ అని తెలుస్తోంది.

ఈ సినిమాకు సునీల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే విషయం ఇప్పుడు షాకింగ్ గా మారింది. కొద్దిరోజుల కాల్షీట్స్ కోసం ఏకంగా రూ.కోటి రూపాయల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. కమెడియన్ రోల్ కోసం ఈ రేంజ్ లో ముట్టజెప్పడం విశేషమనే చెప్పాలి!

Last Updated 1, Aug 2018, 6:12 PM IST