ఇంటికి రాలేదని నటిపై భర్త కాల్పులు!

Published : Aug 01, 2018, 05:41 PM IST
ఇంటికి రాలేదని నటిపై భర్త కాల్పులు!

సారాంశం

చాలా కాలంగా విదేశాల్లో పని చేస్తోన్న ఫైదాఖాన్ ఇటీవలే పాక్ కు తిరిగి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు

పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ నటి, గాయని అయిన రేష్మఖాన్ ను తన భర్త కాల్చి చంపడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ ఘటన ఖైబర్ పంక్తువా జిల్లాలోని నేషెరా ప్రాంతంలో చోటు చేసుకుంది. భర్త ఫైదాఖాన్ తో గొడవ పడిన రేష్మ ఇంటి నుండి బయటకు వచ్చేసి తన తల్లితండ్రుల వద్ద ఉంటోంది. దీంతో అత్తారింటికి వెళ్లి భార్యను ఇంటికి రావాల్సిందిగా కోరాడు.

దానికి ఆమె నిరాకరించడంతో కోపం కంట్రోల్ చేసుకోలేక తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో రేష్మ అక్కడిక్కడే మరణించింది. దీంతో రేష్మ సోదరుడు అతడిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

చాలా కాలంగా విదేశాల్లో పని చేస్తోన్న ఫైదాఖాన్ ఇటీవలే పాక్ కు తిరిగి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌
9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?