
పాపం సందీప్ కిషన్ వరుస సినిమాలతో.. వరుస ప్లాప్ లు ఫేస్ చేస్తూ వస్తున్నాడు. ఇక సందీప్ కిషన్ పని అయిపోయింది అనుకున్న టైమ్ లో మరో ప్రమోగంతో.. ఆశలన్నీ ఈసినిమాపై పెట్టుకుని... సైలెంట్ గా రాబోతున్నాడు యంగ్ హీరో.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హిట్టు కొట్టి కొన్నేళ్లు అవుతోంది. ఏ సినిమా చేసినా.. ఎన్ని ప్రయోగాలు చేసినా..సందీప్ ను హిట్టు వరించడంలేదు. దాంతో ఆఈసారి ఎలాగైన సాలిడ్ సక్సెస్ సాధించాలి అనన పట్టుదలతో.. సైలెంట్ గా వస్తున్నాడు యంగ్ స్టార్. రీసెంట్ గా మైఖేల్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు తెరకెక్కించిన ఈ మూవీ పై సందీప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అంతే కాదు ఈసినిమా కోసం సిక్స ప్యాక్ చేసి.. టోన్డ్ బాడీతో అదరగొట్టాడు. అయినా సరే నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందించలేక పోయింది.
ఇక తాజాగా సందీప్ కిషన్ పెద్దగా హంగు ఆఈర్బాటాలు లేకుండా ఓ సినిమాను చేస్తున్నారు. ఊరు పేరు భైరవకోన అనే హారర్ థ్రిల్లర్ ఫిలింతో ఆడియన్స్ ముందుకు రావడం కోసం రంగం సిద్దం చేసుకున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ పోస్టర్ తో పాటు ఒక సాంగ్ ని కూడా రిలీజ్ చేయగా.. అవి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఊరు పేరు భైరవకోన మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
ఇక ఈసారి పురణాల కథతో సందీప్ కిషషన్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఈసినిమా గరుడ పురాణం గ్రంథం చుట్టూ తిరగనుంది. ఆ గ్రంథంలో మిస్ అయ్యిన నాలుగు పేజీలే ఈ భైరవకోన కథ అంటూ సందీప్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. టీజర్ వరకూ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా రూపొందించారు.. మర ివిజువల్స్ పరంగా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన వి ఐ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. వర్ష బొలమ్మ కావ్య థాపర్, వెన్నల కిషోర్, వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.