
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమా చేస్తున్న సమయంలోనే చైతు డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి దూత అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ సినిమాకి కూడా విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ సిరీస్ లో మొదటిసారిగా నాగచైతన్య నెగిటివ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అయితే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ అంతా పూర్తి చేసుకున్నప్పటికీ ఆమెజాన్ మాత్రం ఈ వెబ్ సిరీస్ విడుదల చేయకుండా పెండింగ్ పెట్టింది. షూటింగ్ పూర్తి అయిన తర్వాత అమెజాన్ ఈ వెబ్ సిరీస్ విడుదల చేయకపోవడానికి కారణం ఏంటనేది ఎవరికీ తెలియలేదు.
అయితే ఆ మధ్యన వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో నాగచైతన్య డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ఇద్దరు కూడా ఫామ్ లో లేరు ఇలాంటి సమయంలో వెబ్ సిరీస్ విడుదల చేసినప్పటికీ ఈ వెబ్ సిరీస్ పై పెద్దగా బజ్ ఏర్పడదని,అందుకే మరి కొంతకాలం పాటు ఈ వెబ్ సిరీస్ విడుదల చేయకుండా వాయిదా వేయాలని అమెజాన్ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అవి నిజమో కాదో కానీ ఇప్పుడు మాత్రం ఈ సీరిస్ రిలీజ్ రంగం సిద్దమైందని సమాచారం.
తాజాగా తన చిత్రం కస్టడీ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యినప్పుడు నాగచైతన్య... ఈ ప్రస్తావన వచ్చింది. షూటింగ్ పార్ట్ ఎప్పుడో చాలా కాలం క్రితం పూర్తైందని తెలిపారు. అయితే అమేజాన్ ప్రైమ్ వీడియో వారి దగ్గర పెండింగ్ లో ఉందని అన్నారు. మిగతా భాషల్లోకు డబ్ చేయటానికి టైమ్ తీసుకుంటున్నారని చెప్పారు. అలాగే రీసెంట్ గా తాను టీమ్ తో కలిసానని, వారు చెప్పినదాని ప్రకారం ఆగస్ట్ లో ఈ సీరిస్ విడుదల అవుతుందని చెప్పారని అన్నారు. అంటే ఆగస్ట్ లో ఈ సీరిస్ స్ట్రీమింగ్ అవుతుందన్నమాట.
ఏదైమైనా "దూత" వెబ్ సిరీస్ బావుంది అని వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంటే తప్ప దీనికి అంత బజ్ కూడా రాదు. అందుకే అమెజాన్ వారు "దూత" విడుదలని కొన్ని రోజులు హోల్డ్ లో పెట్టి ఉంటారంటున్నారు. నాగచైతన్య సినిమా ఏదైనా విడుదల అయ్యి సూపర్ హిట్ అయితే అదే సమయంలో ఈ వెబ్ సిరీస్ ని కూడా విడుదల చేస్తే బాగుంటుందని అమెజాన్ వారు అభిప్రాయపడుతున్నట్లు చెప్తున్నారు. కష్టడీ మీద మంచి నమ్మకాలు ఉన్నాయి. బజ్ క్రియేట్ అయ్యింది. మరోవైపు విక్రమ్ కుమార్ "దూత" సీక్వెల్ కి స్క్రిప్ట్ కూడా త్వరలోనే మొదలు పెట్టనున్నారు. ఇక వెబ్ సిరీస్ రిజల్ట్ తో పని లేకుండా దీనికి సెకండ్ సీజన్ కూడా ఉందని తెలుస్తోంది.