
ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా ఓటీటీలోకి వచ్చేస్తుంది సందీప్ కిషన్ మైఖేల్ మూవీ. ఈ సారి ఎలాగైనా మంచి కమర్షియల్ హిట్ సాధించాలని మైఖేల్ వంటి పాన్ ఇండియా సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కాని ఈసారి కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు సందీప్. సినిమా సెలక్షన్ లో.. కథ విషయంలో కాస్త తడబడ్డాడు యంగ్ హీరో. దంతో మూవీ వర్కౌట్ అవ్వకపోవడంతో రిలీజ్ అయిన రెండు మూడు రోజులకే.. బాక్సాపీస్ దగ్గర చతికలపడిపోయింది సినిమా.
ఇక ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి కూడా వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా మేఖేల్ మూవీని సోంతం చేసుకోవడంతో పాటు డిజిటల్ స్క్రీమింగ్ డేట్‌ను కూడా ప్రకటించింది. ఈ సినిమాను ఫిబ్రవరి 24నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది ఆహా. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ సినిమా బడ్జెట్‌లో సగం కూడా రికవరీ చేయలేపోయింది. రంజిత్ జయంకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్ నటించింది. విజయ్ సేతుపతి, గౌతమ్‌మీనన్, వరుణ్ సందేష్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.
చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. గత కొన్ని ఏళ్ళుగా కమర్షియల్ సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. యాక్టింగ్ టాలెంట్ తో పాట్ హ్యాండ్సమ్ గా ఉండే సందీప్ కిషన్ సక్సెస్ కోసం చేయని ప్రయత్నం లేదు. కథ విషయలో జాగ్రత్త పడ్డాడు. సిక్స్ ప్యాక్ బాడీ చేశాడు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా యంగ్ హీరోకి మాత్రం అదృష్టం కలిసిరాక కమర్షియల్ హీరో స్టేటస్ పొందలేకపోతున్నాడు. ఎంత ప్రయత్నించినా మంచి హిట్ కొట్టలేకపోతున్నాడు.
కెరీర్ బిగెనింగ్ నుండి డిఫరెంట్ గా కథలు తీసుకుని సినిమాలు చేస్తున్నాడు సందీప్ కిషన్. కాని అడపా దడపా హిట్లు తప్పించి పక్కాగా సక్సెస్ సాధించినవి వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. విభిన్న సినిమాలు చేస్తున్నా సందీప్‌కు రావాల్సినంత గుర్తింపు మాత్రం రావడం లేదు. మాస్ ఇమేజ్ కోసం కమర్షియల్ సినిమాలు తీసినా ఉపయోగం లేకుండా పోయింది.