మహాశివరాత్రి సందర్భంగా డార్లింగ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ అందింది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ప్రాజెక్ట్ కే’ నుంచి తాజాగా అఫీషియల్ అప్డేట్ అందింది..
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్స్ అందుతున్నాయి. చివరిగా ‘రాధే శ్యామ్’తో ఫ్యాన్స్ కు అప్సెట్ చేసిన డార్లింగ్.. తన అప్ కమింగ్ ఫిల్మ్స్ తో ఖుషీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో పాన్ వరల్డ్ గా భారీ యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రాబోతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కే’ (Project K). టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అయితే, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ను అందించారు. ఇప్పటికే అందరూ ఊహించినట్టుగా చిత్రం వచ్చే ఏడాదే విడుదల కాబోతోంది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేస్తూ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ‘అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రపంచం ఎదరుచూస్తోంది. 2024 జనవరి 12 వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది’ అంటూ వైజయంతి మూవీస్ వారు అధికారికంగా అప్డేట్ అందించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తాజాగా మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. భారీ పరిమాణంలో ఉన్న చేతివెళ్లు నెలపై పడి ఉంటాయి. చేతినే ముగ్గురు ఆఫీసర్లు గన్స్ తో టార్గెట్ చేశారు. అయితే మనిషి చేతిలాగే ఉన్నప్పటికీ పరిమాణంలో మాత్రం చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక చుట్టూ యంత్రాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఎన్నో ప్రశ్నలకు తెరలేపుతోందీ పోస్టర్. సినిమాపై అంతంతకు ఆసక్తినీ పెంచుతోంది. చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నటిస్తున్నారు.
ఇక భారీ విజువల్స్ తో చిత్రం రెండు పార్టులుగా విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రపంచం మెచ్చే కథను నాగ్ అశ్విన్ సిద్ధం చేశారంటున్నారు. షూటింగ్ చకాచకా కొనసాగుతోంది. అటు సలార్ కూడా దాదాపు చిత్రీకరణ ముంగిపు దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ‘సలార్’ ఈఏడాది సెప్టెంబర్ 28న విడుదల కాబోతుంది. అంతకన్న ముందే ఆదిపురుష్ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఈ చిత్రాల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
𝟏𝟐-𝟏-𝟐𝟒 𝐢𝐭 𝐢𝐬!
Happy Mahashivratri. pic.twitter.com/MtPIjW2cbw