Allu Arjun Emotional: సుకుమార్‌ ఎమోషనల్‌ స్పీచ్‌కి కంటతడి పెట్టుకున్న బన్నీ.. పుస్తకంగా `పుష్ప`

Published : Dec 28, 2021, 03:17 PM IST
Allu Arjun Emotional: సుకుమార్‌ ఎమోషనల్‌ స్పీచ్‌కి కంటతడి పెట్టుకున్న బన్నీ.. పుస్తకంగా `పుష్ప`

సారాంశం

దర్శకుడు సుకుమార్‌ సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అందులో భాగంగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బన్నీ ఒక కాంప్లెక్స్ యాక్టర్‌ ప్రశంసించారు.

అల్లు అర్జున్‌(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం `పుష్ప`(Pushpa). `ఆర్య`, `ఆర్య2` తర్వాత చాలా గ్యాప్‌తో `పుష్ప` రూపొందింది. ఈ నెల(డిసెంబర్‌ 17న) విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రూ.200కోట్ల కలెక్షన్లని సాధించింది. ఈ చిత్రం ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్‌ ఏర్పాటు చేశారు. ఇందులో దర్శకుడు సుకుమార్‌ సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. 

అందులో భాగంగా ఐకాన్‌ స్టార్‌ Allu Arjunగురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బన్నీ ఒక కాంప్లెక్స్ యాక్టర్‌ ప్రశంసించారు. ఆయన అన్ని రకాల ఎమోషన్స్ ని పండించగలరని, అనేక లేయర్స్ ని మిక్స్ చేసి పర్‌ఫెర్మెన్స్ ని అల్లుకుంటాడని, ఆయన వ్యూవర్స్ ఎక్స్ ప్రెషన్‌ అని చెప్పారు. ఇక తాను మునిగిపోతున్న సమయంలో తనని నీళ్లలో నుంచి బయటకు లాగాడని తెలిపారు సుకుమార్‌. `నేను తెప్పమీద అలా ఉన్నాను. మునిగిపోతున్నాను. అందరు అలా కూర్చొని చూస్తున్నారు. అలాంటి సమయంలో ఒక దూకు దూకాడు. నన్ను మునిగిపోనివ్వకుండా బయటకు తీసుకొచ్చాడు. ఆ సమయంలోనే నాకు అనిపించింది బన్నీ నాకు దేవుడు అని. ఆ తర్వాత నేను ఆయన్ని కిందకు లాగేస్తున్నా, ఇద్దరం పోరాడుతున్నాం. ఇంకో కొంత మంది వచ్చి మమ్మల్ని లాగారు` అంటూ ఎమోషనల్‌ అయ్యాడు దర్శకుడు సుకుమార్‌. 

సుకుమార్‌ ఎమోషనల్‌ డైలాగ్‌లకు బన్నీ భావోద్వేగానికి గురయ్యారు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వాటిని తూడ్చుకోవడం వైరల్‌గా మారింది. ఇంకా బన్నీ గురించి సుకుమార్‌ చెబుతూ, `బన్నీ మాట్లాడేటప్పుడు కూల్‌గా సరదా సరదాగా మాట్లాడతాడు. కానీ ఆయనలో చాలా డెప్త్ ఉంది. లోపలు గ్రేట్‌ ఫిలాసఫర్‌ ఉన్నాడు. `ఆర్య` సినిమా టైమ్‌లో నేను అప్పుడే లెక్చర్‌ చేసి వచ్చాను. అప్పుడు నేను ఏది చెబితే అది విన్నాడు. `పుష్ప`కి ఆయన ఏది చెబితే అది నేను విన్నాను` అని సరదాగా సెటైర్‌ వేశాడు సుకుమార్‌. ఆ తర్వాత మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ చేసిన మ్యాజిక్‌ అంతా ఇంతా కాదని, అన్ని పాటలు గ్లోబల్‌ వైడ్‌గా చార్ట్ బస్టర్లో నిలిచాయన్నారు. అలాగే మంచి పాటలు అందించిన చంద్రబోస్‌ని అభినందించారు.

సుకుమార్‌ డైరెక్షన్‌లో బన్నీ, రష్మిక మందన్నా జంటగా నటించిన `పుష్ప` చిత్రంలో అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. మలయాళనటుడు ఫహద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన పాత్ర రెండో భాగంలో ఉండబోతుంది. సమంత ఇందులో `ఊ అంటావా..`అనే ఐటెమ్‌ సాంగ్‌ చేయడం విశేషం. అది బాగా ఆదరణ పొందింది. `పుష్ప` నుంచి మరో పార్ట్ `పుష్పః ది రూల్‌` సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని పుస్తక రూపంలోనూ తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు దర్శకుడు సుకుమార్‌ తెలిపారు.

also read: Pushpa: రష్మిక చెప్పింది నిజమే,సారీ చెప్పిన సుకుమార్!

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు