Niharika-Allu Arjun: నెక్స్ట్ టైం మోసం చేయొద్దు.. బన్నీ పై నిహారిక ఆసక్తికర కామెంట్

Published : Dec 28, 2021, 01:51 PM IST
Niharika-Allu Arjun: నెక్స్ట్ టైం మోసం చేయొద్దు.. బన్నీ పై నిహారిక ఆసక్తికర కామెంట్

సారాంశం

నాగబాబు తనయ  నిహారిక అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు క్రిస్మస్ గిఫ్ట్స్ ఇచ్చారట. ఆమె వారిద్దరి కోసం శాంటాక్లాజ్‌గా మారినట్లు తెలుస్తోంది.

సందర్భం ఏదైనా కలిసి జరుపుకోవడం మెగా ఫ్యామిలీ లో ఉన్న మంచి సాంప్రదాయం. ముఖ్యంగా పండుగ సందర్భాల్లో అందరూ ఒక చోట చేరి సందడిగా జరుపుకుంటారు. సాధక బాధల్లో అందరూ కలిసి ఉంటారు. చిరంజీవి అలవాటు చేసిన ఈ పద్దతిని నవతరం ఫాలో అవుతున్నారు. చరణ్, అల్లు అర్జున్ (Allu Arjun), సాయి ధరమ్, వరుణ్ అందరూ కలిసి వేడుకలు చేసుకుంటూ ఉంటారు. 

ఇక డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు మెగా హీరోలు. రామ్‌చరణ్ (Ram Charan)‌-ఉపాసన, చైతన్య-నిహారిక దంపతులు, వరుణ్‌తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌తో పాటు చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుష్మితా శనివారం క్రిస్మస్ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా నాగబాబు తనయ  నిహారిక అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు క్రిస్మస్ గిఫ్ట్స్ ఇచ్చారట. ఆమె వారిద్దరి కోసం శాంటాక్లాజ్‌గా మారినట్లు తెలుస్తోంది. 

నిహారిక (Niharika)తన సోమికల్ మీడియా పోస్ట్స్ ద్వారా ఈ విషయం తెలియజేసింది. అన్నయ్య చరణ్ కి  గిఫ్టులిచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. 'ఎవరికీ తెలియకుండా, ఏ అనుమానం రాకుండా ఇంట్లో బహుమతులను దాయడం ఎంత కష్టమో పక్కనపెడితే నీకు సీక్రెట్‌ శాంటాగా ఉండటం నాకిష్టం చరణ్‌ అన్న.. అలాగే ఎంతో ఓపికగా 'నాటునాటు' పాటకు స్టెప్పులు నేర్పించినందుకు థ్యాంక్స్‌' అని రాసుకొచ్చింది. 

అలాగే అల్లు అర్జున్ కి కూడా ఆమె క్రిస్మస్ (Christmas 2021) గిఫ్ట్స్ సిద్ధం చేశారు. అల్లు అర్జున్ కి ఇచ్చిన బహుమతుల గురించి మాట్లాడుతూ...  'ఇదిగో ఇక్కడుంది నా శాంటా.. సినిమా ప్రమోషన్లతో ఎంత బిజీగా ఉన్నా కూడా నాకోసం ఎన్నో బహుమతులు పట్టుకొచ్చాడు. థాంక్యూ బన్నీ అన్నా.. నెక్స్ట్‌ టైం మాత్రం ఇలా మోసం చేయొద్దే..' అని అల్లు అర్జున్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేసింది. కాగా నిహారికకు బన్నీ చేసిన మోసం ఏమిటో అర్థం కాక నెటిజెన్స్ ఆలోచనలో పడ్డారు. 

Also read Pushpa Part-2 : తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్.. పుష్ప పార్ట్ 2 కూడా వచ్చేస్తోంది..?

ఇటీవలే నిహారిక మొదటి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్నారు. దీని కోసం భర్త వెంకట చైతన్యతో కలిసి విదేశీ టూర్స్ కి వెళ్లారు. అక్కడ స్కై డైవింగ్ వంటి సాహసాలలో కూడా నిహారిక పాల్గొన్నారు. సదరు వీడియో నిహారిక సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ పెట్టారు. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక వివాహం ఘనంగా జరిగింది. మెగా హీరోలు అందరూ పాల్గొన్న ఈ వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇక పెళ్లి తర్వాత కూడా నిహారిక నటిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. 

Also read Un stoppable:అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇలా ఉందేంటి?

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?