Salman Khan Dance : సల్మాన్ ఖాన్ తో పోటీపడి డాన్స్ చేసిన జెనీలియా.. వైరల్ అవుతున్న వీడియో.

Published : Dec 28, 2021, 02:20 PM IST
Salman Khan Dance : సల్మాన్ ఖాన్ తో పోటీపడి డాన్స్ చేసిన జెనీలియా.. వైరల్ అవుతున్న వీడియో.

సారాంశం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, మాజీ హీరోయిన్ జెనీలియా పోటా పోటీగా డాన్స్ చేశారు. ఒకరికి మించి మరొకరు పోటీపడుతూ..నువ్వా నేనా అన్నట్టు పెర్ఫామ్ చేశారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్( Salman Khan), టాలీవుడ్,బాలీవుడ్ మాజీ హీరోయిన జెనీలియా(Genelia). ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తారు అని ఎవరైనా ఊహించారా..? అసలు వీరిద్దరూ కలిసి డాన్స్ చేయడం ఏంటీ..? అది కూడా ఎక్కడ.? ఎప్పుడు..? ఇలా చాలా డౌట్స్ వచ్చి ఉంటాయి అందరికి. ఎప్పుడో సినిమాల నుంచి క్విట్ అయ్యి.. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న జెనీలియా.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో డాన్స్ చేసే సందర్భం ఎప్పుడు వచ్చిందబ్బా అని చాలామంది అనుమానం రావచ్చు.

సల్మాన్ ఖాన్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫామ్ హౌస్ లో భారీ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బాలీవుడ్ నుంచి స్టార్ సెలబ్రెటీలు చాల మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జెనీలియా తో పాటు ఆమె భర్త రితేష్ కూడా  హజరయ్యారు.అయితే ఈ పార్టీలో అందరిని ఆకర్షించారు సల్మాన్- జెనీలియా.  సడెగా ఓ సాంగ్ కు డాన్స్ స్టార్ట్ చేసి.. ఇద్దరూ  కలిసి చాలాసేపు డాన్స్ చేస్తూనే ఉన్నారు.  అక్కకడ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా.. వీళ్లిద్దరిని ఉత్సాహపరుస్తూ.. అరుపులు.. కేకలు.. ఈలలతో సందడి చేశారు.

 

 చిన్నగా స్టార్ట్ చేసి.. నాన్ స్టాప్ గా.. ఉత్సాహంగా డాన్స్ చేస్తూనే ఉన్నారు ఇద్దరు స్టార్స్. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జెనీలియా. పెద్ద మనసున్న సల్మాన్ ఖాన్ కు హ్యాపీ బర్త్ డే అంటూ స్టార్ట్ చేసి..ప్రేమ,సంతోషంతో మీరు కలకాలం ఆరోగ్యంగా ఉండాలి. “ఆజ్ భాయ్ కా బర్త్ డే హై ” అంటూ ఇన్ స్టాలో  పోస్ట్ పెట్టారు జెనీలియా. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ డాన్స్ పర్ఫామెన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇక సల్మాన్ ఖాన్ 56వ బర్త్ డే సందర్భంగా సందడి చేశారు. ఏజ్ పెరుగుతున్నాకొద్ది.. ఉత్సాహం కూడా పెరుగుతుంది సల్లూ భాయ్ కి. ఇంకా కుర్ర హీరోలా మారిపోతున్నాడు. ఫిట్ నెస్ విషయంలో కాని.. డాన్స్ విషయంలో కాని.. యాక్టింగ్...గ్లామర్ విషయంలో కాని ఎక్కడా తగ్గకుండా.. మెంటేన్ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. తన ఫామ్ హౌస్ లో నిన్న విషయం లేని పాము కాటుకు గురయ్యారు సల్మాన్. హస్పిటల్ లో జాయిన్ అయ్యి.. వెంటనే డిశ్చార్జ్ కూడా అయ్యారు. వరుస సినిమాలతో.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో  దుమ్ము రేపుతున్నారు సల్మాన్ ఖాన్.

Also Read ; Surya Movie Update: కొత్త అవతారంలో సూర్య.. హ్యాట్రిక్ హిట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు