నా ఈగో హర్ట్ చేశాడు.. కుర్ర దర్శకుడిపై సుకుమార్ కామెంట్స్!

Published : Oct 17, 2018, 03:53 PM IST
నా ఈగో హర్ట్ చేశాడు.. కుర్ర దర్శకుడిపై సుకుమార్ కామెంట్స్!

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాల్లో పొగడ్తల పూజలు జరుగుతూనే ఉంటాయి. ఒక వ్యక్తి దగ్గర పని చేస్తున్నప్పుడు వారిని పొగుడుతూ మంచి చేసుకోవడం చూస్తుంటాం. కానీ దర్శకుడు సుకుమార్ దగ్గర పని చేసిన ఓ అస్సిస్టెంట్ డైరెక్టర్ మాత్రం స్పష్టంగా మాట్లాడి సుకుమార్ ఈగోని హర్ట్ చేశాడట

సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాల్లో పొగడ్తల పూజలు జరుగుతూనే ఉంటాయి. ఒక వ్యక్తి దగ్గర పని చేస్తున్నప్పుడు వారిని పొగుడుతూ మంచి చేసుకోవడం చూస్తుంటాం. కానీ దర్శకుడు సుకుమార్ దగ్గర పని చేసిన ఓ అస్సిస్టెంట్ డైరెక్టర్ మాత్రం స్పష్టంగా మాట్లాడి సుకుమార్ ఈగోని హర్ట్ చేశాడట.

ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.. 'వీర భోగ  వసంతరాయలు' సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్న ఇంద్రసేన గతంలో సుకుమార్ దగ్గర అస్సిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. '1 నేనొక్కడినే' సినిమా సమయంలో సుకుమార్ తో ఈ సినిమా భయంకరమైన ఫ్లాప్ అవుతుందని చెప్పాడట ఇంద్రసేన.

దీంతో సుకుమార్ ఈగో హర్ట్ అవ్వడంతో సుకుమార్ కి దూరమయ్యాడు ఇంద్రసేన. కానీ అతడు చెప్పిందే నిజం కావడంతో అతడి విలువ దూరంగా అయ్యాక తెలిసిందంటూ ఇటీవల సుకుమార్ కామెంట్స్ చేశారు. ఇంద్రసేన డైరెక్ట్ చేసిన 'వీర భోగ వసంతరాయలు' మంచి విజయం కావాలని కోరుకున్నారు. అక్టోబర్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది!

PREV
click me!

Recommended Stories

Bigg Boss కు వెళ్ళడం వల్ల చాలా నష్టపోయాను, అవకాశాలు కోల్పోయాను, టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Varun Sandesh: అందుకే మాకు పిల్లలు పుట్టలేదు, వచ్చే ఏడాది గుడ్ న్యూస్ చెబుతామంటున్న హీరో