బోయపాటి తీరుతో నిర్మాత అసహనం!

Published : Oct 17, 2018, 03:23 PM IST
బోయపాటి తీరుతో నిర్మాత అసహనం!

సారాంశం

దర్శకుడు బోయపాటి శ్రీను ఏం చేసినా చాలా భారీగా ఉండాలని అనుకుంటారు. ఆయన సినిమాలన్నీ కూడా అలానే ఉండేలా చూసుకుంటాడు. ఒక్కో ఫైట్ సీక్వెన్స్ కి కోట్లలో ఖర్చు పెట్టిస్తుంటారు. ఆయన సినిమాలకు హిట్ టాక్ వచ్చినా.. వసూళ్లు మాత్రం లాభాలను తీసుకురాలేవు. 

ఒక్క 'సరైనోడు' తప్ప బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాలు లాభాలు తెచ్చిపెట్టింది లేదు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. దీనికి 'వినయ విధేయ రామ' అనే టైటిల్ ని అనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఇప్పటికే వంద రోజులు దాటేసింది.

ఇంకా ముప్పై రోజులు షూటింగ్ బాలన్స్ ఉందట. ఒక సినిమా కోసం ఇన్ని రోజులు సమయం వెచ్చించడం మామూలు విషయం కాదు. అనుకున్న బడ్జెట్ కంటే సినిమా ఖర్చు దాటేస్తుందని తెలుస్తోంది. సినిమా కోసం వంద కోట్లు అనుకుంటే ఇప్పుడు మరో పాతిక పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో నిర్మాత దానయ్య.. బోయపాటి తీరుతో విసిగిపోతున్నాడట. ఆ విషయం బయటకి చెప్పలేక తనలో తనే మదన పడుతున్నాడని టాక్. గతంలో బోయపాటితో సినిమాలు చేసిన నిర్మాతల పరిస్థితి కూడా ఇలానే ఉండేదని ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటుంటారు. మరి ఈ సినిమాకైనా లాభాలు మిగులుతాయేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Rajasekhar: నేనేమీ శ్రీరామచంద్రుడిని కాదు, కొన్ని తప్పులు చేశా, జీవిత ముందే ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
This Week Theatre Movies: ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలు.. అందరి చూపు వీటిపైనే