మహేష్ మరో ప్రయోగానికి సిద్దమేనా?

Published : Oct 17, 2018, 03:34 PM IST
మహేష్ మరో ప్రయోగానికి సిద్దమేనా?

సారాంశం

ఒక ఘటన ఆధారంగా చేసుకొని సుకుమార్ కథ రాసుకుంటున్నాడు. మాహేష్ తో సినిమా చేయనున్నట్లు సుక్కు ముందే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. 

సూపర్ స్టార్ మాహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరక్కుతున్న ఆ సినిమాలో మహేష్ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు. నాలుగు పదుల వయసొచ్చినప్పటికీ కాలేజ్ కుర్రాడిలా అమ్మాయిలను తెగ ఆకర్షిస్తున్నాడు. ఇకపోతే దాని తరువాత చిత్రంలో మాత్రం మహేష్ మరో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని సమాచారం. 

ఒక ఘటన ఆధారంగా చేసుకొని సుకుమార్ కథ రాసుకుంటున్నాడు. మాహేష్ తో సినిమా చేయనున్నట్లు సుక్కు ముందే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన 1 నేనొక్కడినే డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఎలాగైనా ఇప్పుడు మహేష్ కు మంచి హిట్ ఇవ్వాలని సుకుమార్ ప్రిపేర్ అవుతున్నాడు. 

ఇక కథ విషయానికి వస్తే.. తెలంగాణకు సంబందించిన ఒక సాయుధ పోరాటంను ప్రేరణగా చేసుకొని సుకుమార్ కథను అల్లుడుతున్నాడట. భావోద్వేగంతో కూడిన సన్నివేశాలు చాలా ఉంటాయట. మహేష్ ఇలాంటి కథలకు ఎంతవరకు సెట్ అవుతాడనేది చెప్పడం కష్టమే గాని రామ్ చరణ్ ను రంగస్థలంలో ప్రజెంట్ చేసినట్టు మహేష్ ను కూడా ఒక పోరాట యోధుడిగా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తే ఆడియోఎన్స్ ఒప్పుకోవచ్చు. 

అయితే ప్రయోగాలకు చాలా వరకు ధుమరంగా ఉంటానని చెప్పిన మహేష్ ఇప్పుడు సుకుమార్ తో మరో ప్రయోగానికి సిద్దమవుతాడా లేదా అనేది చూడాలి. 

PREV
click me!

Recommended Stories

అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య