సుహాస్ ‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్’, విజయ్ ఆంటోనీ ‘హిట్లర్’, ‘ప్రేమకథ’ సినిమాల నుంచి కీలక అప్డేట్స్.!

Published : Dec 26, 2023, 11:18 PM IST
సుహాస్ ‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్’, విజయ్ ఆంటోనీ ‘హిట్లర్’, ‘ప్రేమకథ’ సినిమాల నుంచి కీలక అప్డేట్స్.!

సారాంశం

సుహాస్ నటించిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’తో సహా మరో రెండు చిత్రాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందాయి. రిలీజ్ డేట్లు అనౌన్స్ చేశారు. మరో మూవీ టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. 

‘కలర్ ఫొటో’, ‘హిట్ 2’ సినిమాలతో సుహాస్ (Suhas)  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నెక్ట్స్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band).  ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు. 2024 ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.  

సంక్రాంతి కానుకగా రిలీజ్... 
కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ప్రేమకథ’. ఈ చిత్రాన్ని టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఉపేందర్ గౌడ్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివశక్తి రెడ్ డీ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "ప్రేమకథ" సినిమా జనవరి 5న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. 

విజయ్ ఆంటోనీ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్లర్’ టీజర్...
వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ Vijay Antony తన కొత్త సినిమా ‘హిట్లర్’తో తెరపైకి రాబోతున్నాడు. చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా "హిట్లర్" సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. "హిట్లర్" సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా టీజర్ ను రిలీజ్  చేశారు.టీజర్ విషయానికొస్తే.. డిక్టేటర్ లాంటి ఒక రాజకీయ నాయకుడు, అతన్ని వేటాడే ఓ కిల్లర్, ఆ ప్లాన్ ను అడ్డుకుని..కిల్లర్ ను టార్గెట్ చేసిన ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్... ఈ మూడు పాత్రలను పరిచయం చేస్తూ టీజర్ సాగింది. కిల్లర్ గా విజయ్ ఆంటోనీ కొత్త లుక్, క్యారెక్టరైజేషన్ లో కనిపించారు. వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ తో టీజర్ ఆకట్టుకుంది.ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ పౌరుడి కథే ఈ సినిమా.  

PREV
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?