
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఫిల్మ్ Salaar Cease Fire థియేటర్లలో దుమ్ములేపుతోంది. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి అభిమానులు, ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభాస్ ను ఎన్నో ఏళ్లుగా యాక్షన్ మోడ్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ కు దర్శకుడు Prashanth Neel ఫుల్ మీల్స్ అందించారు. డార్లింగ్ కు ఇచ్చిన ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ లకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలు, నార్త్, సౌత్, ఓవర్సీస్ లోనూ ప్రస్తుతం Salaar క్రేజే కనిపిస్తోంది. ముఖ్యంగా నేపాల్ లో ‘సలార్’ కోసం ఫ్యాన్స్, ఆడియెన్స్ థియేటర్ల వద్ద బారులు తీరారు. టికెట్ల కొనుగోలు కోసం పెద్దపెద్ద క్యూ లైన్లలో వేచి ఉన్నారు. గత రోజులను గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నేపాల్ లో సినిమా హాళ్ల ముందు ఆడియెన్స్, ఫ్యాన్స్ హంగామా చూసిన డార్లింగ్ అభిమానులు మరింతగా ఖుషీ అవుతున్నారు.
డైనోసార్ దెబ్బకు ప్రస్తుతం మిగితా సినిమాలన్నీ సైలెంట్ అయ్యాయి. సలార్ ఒక్కటే పీక్స్ లో రచ్చ చేస్తోంది. ఫ్యాన్స్, ఆడియెన్స్ కూడా ఈ చిత్రానికే మొగ్గుచూపిస్తున్నారు. రిపీటెడ్ ఆడియెన్స్ కూడా ఉన్నారు. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.402 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక రెండో వీకెండ్ పూర్తి చేసే వరకు భారీ మార్క్ ను చేరుకుంటుందని అంటున్నారు.
సలార్ సీజ్ ఫైజ్ మొదటి పార్ట్ కాగా, సలార్ శౌర్యాంగ పర్వం రెండో భాగంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెకండ్ పార్ట్ ప్రభాస్ మరింత వైల్డ్ గా కనిపించనున్నారని రీసెంట్ ఇంటర్వ్యూల్లో టీమ్ వెల్లడించింది. ఇక సలార్ లో హీరోయిన్ శృతిహాసన్ కథానాయికగా నటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, బ్రహ్మాజీ, శ్రియా రెడ్డి, యాంకర్ ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. రవి బర్సూర్ సంగీతం అందించారు.