Bhola Shankar update: ఫ్యాన్స్ కోసం చిరంజీవి న్యూ ఇయర్ గిఫ్ట్

Published : Dec 31, 2021, 01:33 PM IST
Bhola Shankar update: ఫ్యాన్స్ కోసం చిరంజీవి న్యూ ఇయర్ గిఫ్ట్

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)జోరు మాములుగా లేదు. ఆయనతో కుర్ర హీరోలు కూడా పోటీపడలేకున్నారు.  వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించిన చిరంజీవి న్యూ ఇయర్ గిఫ్ట్స్ గా సదరు చిత్రాల అప్డేట్స్ ఇస్తున్నారు.

దర్శకుడు కొరటాల శివతో ఆచార్య (Acharya) మూవీ చేస్తున్నారు చిరంజీవి. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ఫిబ్రవరి 4న ఆచార్య వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఆచార్య మూవీ సెట్స్ పై ఉండగానే చిరు వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించారు. వాటిలో కొన్ని సెట్స్ పైకి  వెళ్లాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి భోళా శంకర్ చేస్తున్న విషయం తెలిసిందే. భోళా శంకర్ ఫస్ట్ షెడ్యూల్ సైతం పూర్తి చేసుకుంది. 

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భోళా శంకర్ (Bhola shankar) తెరకెక్కుతుంది. ఈ మూవీ తమిళ హిట్ చిత్రం వేదాళం కి రిమేక్ అని సమాచారం. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరు సిస్టర్ రోల్ చేస్తున్నారు. న్యూ ఇయర్ 2022ని (New Year 2022) పురస్కరించుకొని రేపు భోళా శంకర్ నుండి ఆసక్తికర అప్డేట్ రానుంది. భోళా శంకర్ గా చిరు ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం కలదు. 

Also read Samantha : సమంత డిప్రెషన్ కి చిరంజీవి సలహా.. కట్ చేస్తే సుకుమార్ లక్!

కాగా మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ చేస్తున్నారు. అలాగే దర్శకుడు బాబీ డైరెక్షన్ లో చిరు 154 ప్రకటించారు. వైజాగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్ గా ఇది తెరకెక్కుతుంది. తాజాగా ఛలో, భీష్మ చిత్రాలతో హిట్స్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీకి చిరంజీవి సైన్ చేశారు. మొత్తంగా ఆచార్య తర్వాత చిరంజీవి నుండి నాలుగు చిత్రాలు రానున్నాయి. వీటిలో భోళా శంకర్, గాడ్ ఫాదర్ 2022లో విడుదల కావడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా 2022లో చిరు బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్