వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న వకీల్ సాబ్‌ను ఉగాది కానుకగా ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ సినిమాకు ఓటీటీ డీల్ సెట్ అయ్యినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ రేటుకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఓటీటిలో ఏ డేట్ ని వకీల్ సాబ్ రానుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ హక్కులను దక్కించుకుంది. అలాగే.. జీసినిమాస్ శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన 50రోజుల తర్వాత అంటే.. మే చివరి వారంలో ఈ వేదికలపై అందుబాటులోకి రానుంది. మే 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో వకీల్ సాబ్ స్ట్రీమింగ్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ఇక ఈ సినిమా డిజిటిల్ రైట్స్ దాదాపు 15 కోట్లకి డీల్ జరిగినట్లుగా సమాచారం. సినిమా రిలీజైన 50 రోజులకు అమెజాన్ ప్రైమ్ లో అప్ లోడ్ కానుంది. అభిమానుల కోసమే 50 రోజులు వరుకు వేచి చూసి రిలీజ్ చేస్తున్నామని అమెజాన్ ప్రతినిధులు వెల్లడించారు.
ఈ మూవీలో విమెన్ ఎమ్‌పవర్‌మెంట్ కోసం పోరాడే లాయర్‌గా సరికొత్తగా కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్. సినిమా ఎలాంటిదైనా.. పవన్‌కున్న క్రేజే వేరు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు పవన్ కళ్యాణ్‌ని కొత్తగా చూపించబోతున్న ‘వకీల్ సాబ్’ చిత్రానికి థమన్ సంగీతం, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పవన్ ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌తో పాటు క్రిష్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు.