Dil Raju:రౌడీ బాయ్స్ చిత్రానికి నెగిటివ్ టాక్... థియేటర్ ఎదుటే నిర్మాత దిల్ రాజుకు చేదు అనుభవం

By Sambi ReddyFirst Published Jan 14, 2022, 7:40 PM IST
Highlights

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju)కు చేదు అనుభవం ఎదురైంది. రౌడీ బాయ్స్ థియేటర్ దగ్గర ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు దిల్ రాజుకు ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. దీంతో అక్కడ నుండి జారుకునే ప్రయత్నం చేశారు.

హీరోల కొడుకులతో పాటు దర్శక నిర్మాతల కొడుకులు, బంధువులు పరిశ్రమకు హీరోలుగా పరిచయం కావడం సహజం. పరిశ్రమలో పాతుకు పోయిన వారు తమ వారసుల కోసం గట్టి పునాది వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఖర్చుకు వెనుకాడకుండా డెబ్యూ మూవీనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తారు. కింగ్ నాగార్జున రెండో కొడుకు అఖిల్ మొదటి చిత్రం అఖిల్ కోసం ఏకంగా ముప్పై కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ తెరకెక్కించిన అఖిల్ మూవీ అట్టర్ ప్లాప్ కావడంతో భారీ నష్టాలు మిగిలాయి. 

బెల్లకొండ సురేష్ (Bellamkonda Suresh) తన కొడుకు సాయి శ్రీనివాస్ డెబ్యూ మూవీ అల్లుడు శ్రీను మూవీకి పరిశ్రమ షాక్ అయ్యేలా ఖర్చు చేశాడు. హీరోయిన్ గా సమంత నటించగా.. ఐటెం సాంగ్ తమన్నాతో చేయించారు. ఆ సినిమా కూడా ముప్పై కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కింది. పాజిటివ్ టాక్ రావడంతో లాభాలు రాకున్నా... నష్టాలు మిగల్చకుండా నిర్మాత బెల్లంకొండ సురేష్ ని గట్టెక్కించింది.
 
లేటెస్ట్ గా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బంధువు ఆశిష్ (Ashish)వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కిన రౌడీ బాయ్స్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఇక తన మార్కెట్ కి మించిన రెమ్యూనరేషన్ ఇవ్వడంతో రెచ్చిపోయి నటించింది. లిప్ లాక్ సన్నివేశాలలో రెచ్చిపోయి నటించింది. గతంలో అనుపమ ఇలాంటి బోల్డ్ సన్నివేశాలలో అసలు నటించలేదు.  

దిల్ రాజుకు స్వయానా నెవ్యూ కావడంతో ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించారు. తీరా రౌడీ బాయ్స్ (Rowdy Boys) నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలు అసలు విషయం లేదని, పాత చింతకాయ పచ్చడే తప్ప కొత్తదనం లేదన్న మాట వినిపిస్తుంది. దిల్ రాజు నిర్మాణ సంస్థపై ఉన్న నమ్మకంతో మూవీకి ఓ మోస్తరు వసూళ్లు దక్కాయి. అయితే సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. 

కాగా ప్రసాద్ ఐమాక్స్ లో దిల్ రాజు ఈ సినిమా చూశారు.అనంతరం థియేటర్ నుండి బయటికి వచ్చిన దిల్ రాజు మీడియా కంటిలో పడ్డారు. ఆయనను మీడియా వెంబడించింది. అదే సమయంలో అక్కడున్న ఓ ప్రేక్షకుడు.. ప్లాప్ సినిమాకు ఎందుకు సార్.. అంత ఖర్చుపెట్టారని సూటిగా ప్రశ్నించారు. అసలు సినిమాలో విషయం లేదు, అలాంటప్పుడు అంత బడ్జెట్ అవసరమా అంటూ నిలదీశాడు. దిల్ రాజు సదరు ప్రేక్షకుడు ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అతని ప్రశ్నకు సమాధానంగా ఒకరు.. సినిమాలో మెసేజ్ ఉంది కదా అని అన్నారు. కథ కూడా కొత్తది కాదని మరో ప్రశ్న అతడు సంధించారు. ఈ సంఘటన మీడియాలో కవర్ కాగా.. వైరల్ అవుతుంది. 
 

click me!