Ram gopal Varma : త్వరలోనే నేను చస్తాను.. షాక్ కు గురి చేసిన ఆర్జీవీ

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 14, 2022, 05:17 PM ISTUpdated : Jan 14, 2022, 05:21 PM IST
Ram gopal Varma : త్వరలోనే నేను చస్తాను..  షాక్ కు గురి చేసిన ఆర్జీవీ

సారాంశం

ఎప్పుడూ తన ప్రశ్నలతో సమాజంపై వేటాడే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో సంచనంగా ట్వీట్ చేశారు. అభిమానులకు, సినీ ప్రియులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూనే మరోవైపు తను త్వరలోనే చస్తానంటూ ట్వీట్ చేశారు.   

వరుస సినిమాలతో బిజీగా ఉన్న డేరింగ్ డైరెక్టర్ ఇటీవల కాలంలో సమాజంలోని తప్పొప్పులపైనా స్పందిస్తూ తన వాణి వినిపిస్తున్నారు. గతంలో జరిగిన దిశ ఘటనలో బాధితురాలిని ఓదార్చుతూ, కరోనా ప్రభావంతో సినిమాలు తీయడం ఆపేసిన  చిత్ర యూనిట్లకు తాను ఓ సినిమా చూసి మార్గం నిలిచారు. తను సమాజం కోసం ఎలాంటి పని చేయానని చెబుతున్నా తన ప్రతి మూవ్ మెంట్ మాత్రం ఎదో విధంగా మేసేజ్ ఇచ్చే లాగే ఉంటాయి.  ఇటీవల ఏపీలోని టికెట్ల పై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తున్న తీరు అందరికీ తెలిసిందే.

అయితే సంక్రాంతి సందర్భంగా రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్(Twitter) ఖాతాలో అభిమానులకు, తన ఫాలోవర్స్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ హ్యాపీ సంక్రాంతి, మీ అందరికీ  ఆ దేవుడి ఆశీస్సులతో అంబాని కంటే పెద్ద ఇల్లు, అంబాని కంటే ఎక్కువ మనీ రావాలి.భవిష్యత్ లో వైరస్ మీ దరి చేరకూడదు. అందమైన అమ్మాయిలకు హ్యాండ్ సమ్ అబ్బాయిలు. అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు దొరుకుతారు.  దేవుడి దీవెనలతో భర్తలు ఏం చేసిన, చేయకున్న తమ భార్యలు ఏ మాత్రం ఇబ్బంది పెట్టరు. చిన్న ఫిల్మ్ మేకర్స్ బహుబలి కంటే పెద్ద హిట్ సాధించాలి. నన్ను ద్వేషించే వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, మీ కోరిjకను దేవుడు మన్నించి ఉంటే సాధ్యమైనంత త్వరగా నేను చస్తాను.’ అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. 

 

కాంగ్రెస్ కు చెందిన వరంగల్ పొలిటికల్ లీడర్  కొండా మురళీ జీవిత చరిత్రపై ‘కొండా’మూవీని  తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలోంచి  థిమ్ సాంగ్ ను కూడా రిలీజ్ చేయడంతో కొండా మురళీ అభిమానులు, ఆర్జీవీ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే రామ్  గోపాల్ వర్మ ఏ పని చేసినా పక్కా ప్లానింగ్, పక్కా ఎగ్జిక్యూషన్ ఉండటంతో  ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోతున్నారు.  ఆయన చేసే ఏ ట్వీటైనా ట్విట్టర్ లో కొన్ని గంటల్లలోనే సంచలనం రేపుతోంది.
 

PREV
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి