సమంత, నాగ చైతన్య విడాకుల వల్ల లేడి డైరెక్టర్ కి ఎన్ని ఇబ్బందులో..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 14, 2022, 04:42 PM ISTUpdated : Jan 14, 2022, 04:56 PM IST
సమంత, నాగ చైతన్య విడాకుల వల్ల లేడి డైరెక్టర్ కి ఎన్ని ఇబ్బందులో..

సారాంశం

సమంత , నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. గత ఏడాది అక్టోబర్ లో నాగ చైతన్య, సమంత విడాకులతో విడిపోయారు.

సమంత , నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. గత ఏడాది అక్టోబర్ లో నాగ చైతన్య, సమంత విడాకులతో విడిపోయారు. ఇండస్ట్రీ మొత్తానికి ఇది షాకింగ్ న్యూస్. అభిమానులైతే చాలా రోజుల పాటు ఈ వార్తని జీర్ణించుకోలేకపోయారు. ప్రస్తుతం సమంత, నాగ చైతన్య ఎవరి లైఫ్ వారు జీవిస్తూ.. సినిమాలు చేసుకుంటున్నారు. 

అయితే సమంత, చైతన్య విడాకుల వల్ల లేడి డైరెక్టర్ నందిని రెడ్డికి ఊహించని సమస్య వచ్చి పడింది. నందిని రెడ్డి సమంతతో 'ఓ బేబీ' అనే సూపర్ హిట్ మూవీ తెరకెక్కించింది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య కామియో రోల్ లో మెరిసాడు. 

ఈ చిత్రం తర్వాత నందిని రెడ్డి చై సామ్ ప్రధాన పాత్రల్లో ఒక చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారట. కానీ ఇంతలో వీరిద్దరూ విడిపోయారు. దీనితో నందిని రెడ్డికి అటు చైతన్య, ఇటు సమంత ఇద్దరూ అందుబాటులో లేరట. దీనితో చైతు, సమంత కోసం రెడీ చేసుకున్న కథని ఏం చేయాలని నందిని రెడ్డి డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఈ కథ కోసం నందిని రెడ్డి కొత్త నటీనటుల వేటలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సమంత యశోద, శాకుంతలం అనే పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. నాగ చైతన్య నటించిన బంగార్రాజు చిత్రం నేడు విడుదలైన సంగతి తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన