
ఒక సినిమా హిట్టయితే ఇదివరకు దర్శకులకు ఈజీగా అవకాశాలు దక్కేవి. కానీ కాలం మారింది. హిట్ కొట్టినంత మాత్రాన కథ ఎలా ఉన్నా కూడా నమ్మే పరిస్థితి లేదు. స్క్రిప్ట్ లో మ్యాటర్ ఉంటేనే హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రీసెంట్ గా ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి హిట్ అందుకున్న అజయ్ భూపతి నెక్స్ట్ సినిమాను ఇంకా మొదలుపెట్టలేదు.
ఇటీవల ఒక స్క్రిప్ట్ ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి వినిపించగా అతను వర్క్ చేయడానికి సిద్దమయ్యాడు. అయితే ఆ స్క్రిప్ట్ ఇది వరకే ఇద్దరి హీరోల దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. హీరో నితిన్ సినిమా కథలో కొన్ని మార్పులు చేయమని చెప్పాడట. అయితే దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో రాజీపడేధీ లేదని రామ్ దగ్గరకు వెళ్లగా అతనికి పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ నచ్చలేదట.
దాదాపు ఇద్దరు హీరోలు సినిమాను చేయమని డైరెక్ట్ గా చెప్పడంలో చేసేదేమి లేక బెల్లంకొండ వారబ్బాయితో సినిమా చేయడానికి అజయ్ సిద్ధమయ్యారు. హిట్టు దర్శకులు వెళితే దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సాయి శ్రీనివాస్ ఇప్పుడు నాలుగు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. స్టార్ హీరోలు కూడా ఈ స్థాయిలో ఆఫర్స్ అందుకోవడం లేదు. అవి కూడా భారీ బడ్జెట్ సినిమాలవ్వడం విశేషం.