కమల్ హాసన్, విక్రమ్ లను ఫాలో అవుతున్న సూర్య, వర్కౌట్ అవుతుందా..?

Published : Feb 22, 2023, 03:39 PM IST
కమల్ హాసన్, విక్రమ్ లను ఫాలో అవుతున్న సూర్య, వర్కౌట్ అవుతుందా..?

సారాంశం

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. డిఫరెంట్ కాన్సెప్ట్స్ సెలక్ట్ చేసుకుంటూ వెళ్తున్న స్టార్ హీరో.. ఈసారి కమల్ హాసన్, విక్రమ్ లను ఫాలో అవ్వబోతున్నాడు. ఏ విషయంలో అంటే..? 

ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాను టచ్ చేయబోతున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. తన 42 సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో సూర్య ఈసారి తమిళ స్టర్ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ తో పాటు చియాన్ విక్రమ్ ను ఫాలో అవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఏవిషయంలో అంటే.. వారిమాదిరిగానే ఒక్క సినిమాలో డిఫరెంట్ గెటప్స్ లోకనిపించబోతున్నట్టుతెలుస్తోంది. 

పీరియాడిక్ ఎపిక్ యాక్షన్ జానర్ లో రాబోతున్న ఈ సినిమాలో సూర్య దాదాపు 5 డిఫరెంట్ పాత్రలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూర్య కనిపించనున్న ఐదు పాత్రల పేర్లు కూడా బయటికి వచ్చేశాయి. అరతార్, వెంకటేటర్, మందాకర్, ముకాటర్, పెరుమానాథర్ అనే ఐదు పాత్రల పేర్లు ప్రస్తుతానికి లీక్ అయ్యాయి. పైగా ఈ సినిమా పది భాషలలో రిలీజ్ కానుంది. ఇక సూర్య 5 పాత్రల్లో వన్ మ్యాన్ షో కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. 

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటించబోతున్నాడని క్రేజీ టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ  క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు ఈ సినిమాకు  వీర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఈ విషయం తెలిసిన ప్రభాస్ , సూర్య ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారట. రెండు పవర్ ఫుల్ పాత్రలు స్క్రీన్ మీద కనిపిస్తే.. ఆ ఎనర్జీకి రచ్చ రచ్చే అంటున్నారు సిని జనాలు. కాని ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్  లేదు. ఇది రూమర్ గానే ఉంది. 

ఇక ఈమూవీ 1678 కాలంలో జరిగే కథగా ఉంటుందని సమాచారం. ఈ మూవీలో సూర్య ఓ యోధుడిగా కనిపిస్తాడని..అక్కడి నుండి కాలక్రమంలో ఈ పాత్రతో పాటు మరో నాలుగు పాత్రలలో సూర్య కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అయితే.. ఈ సినిమా అలెగ్జాండర్ కథతో లింక్ అయి వస్తుందంటున్నారు మరికొందరు. మరి ఈ సినిమాలో ఒకవేళ ప్రభాస్ పాత్ర ఉంటే అది ఎలా ఉండబోతోంది. గెస్ట్ రోల్ చేయబోతున్నాడా..? అసలు విషయం ఏంటీ అనేది తెలియాలంటే.. ప్రకటన వచ్చేవరకూ చడాలాల్సిందే. ఇక కెఇ జ్ఞానవేల్ రాజా-వంశీ ప్రమోద్ భారీ బడ్జెట్ తో  సినిమాని నిర్మిస్తున్నారు.

ఈమధ్య ఊహించని కాంబినేషన్లు ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతుండటంతో... మన సినిమాలను కాస్త తక్కువగా చూసిన బాలీవుడ్.. కోలీవుడ్ జనాలు ఇక్కడ సినిమాలు చేయడానికి..ఇక్కడి స్టార్లను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈక్రమంలో తెలుగు, తమిళ క్రేజీ కాంబినేషన్లో ఓ మూవీ రూపొందబోతున్నట్టు తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..
Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్